రాజధాని అమరావతి రైతుల పాదయత్రకు సంబంధించి బీజేపీలో కింద స్థాయి నుంచి కూడా ఒత్తిడి ప్రారంభం అయ్యింది. రాజధాని రైతుల మహాపాదయాత్ర, న్యాయస్థానం టు దేవస్థానం ఈ రోజు 15వ రోజు జరుగుతుంది. ఇప్పటికే రైతులకు గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. రాజధాని రైతులకు పూలతో స్వాగతం పలుకుతున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా రాజధాని రైతులకు స్వాగతం పలుకుతూ ఉండటంతో, పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. టిడిపి, సిపిఐ, సిపిఏం, కాంగ్రెస్, జనసేన పార్టీలు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపాయి. ఈ నేపధ్యంలోనే బీజేపీ నేతల పై కూడా ఒత్తిడి పెరిగింది. బీజేపీ నేతలు కూడా పాదయాత్రలో పాల్గునటానికి హైకమాండ్ మద్దతు కోరారు. పాదయాత్రకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పినప్పటికీ, ఈ రోజు వరకు బీజేపీ నేతలు ఎవరూ పాల్గునలేదు. దీంతో బీజేపీ నేతలు, తాము పాదయాత్రలో పాల్గుంటాం అని, అనుమతి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ని కోరారు. అయితే ఆ పార్టీ ఏపి ఇంచార్జ్ సునీల్ దేవదర్ పాదయాత్రకు వెళ్ళవద్దు అని చెప్పి, బీజేపీ నేతలకు చెప్తున్నట్టుగా, తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే, పార్టీ హైకమాండ్ కు సునీల్ దేవదర్ వ్యవహారం గురించి ఫిర్యాదు చేస్తున్నారు.

sunil 14112021 2

అదే విధంగా రేపు తిరుపతిలో జరిగే బీజేపీ మీటింగ్ లో, అమిత్ షా పాల్గుంటూ ఉండటంతో, ఆ సమావేశంలో అమిత్ షా కు, ఈ విషయంలో ఫిర్యాదు చేసే అంశం పై కూడా నేతలు ఆలోచిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తుందని, అన్ని వర్గాల నుంచి మద్దతు ఇస్తుంటే, బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవదర్ మాత్రం వద్దు అంటున్నారని, ఇప్పటికే బీజేపీ అమరావతి విషయంలో తీర్మానం చేసాం అని, ఇప్పుడు పాదయాత్రకు దూరంగా ఉండటం ఏమిటి అని, సునీల్ దేవదర్ ఎందుకు పాల్గునవద్దని చెప్తున్నారని, భావిస్తున్నారు. ఇప్పటికే సునీల్ దేవదర్ పై బీజేపీ హైకమాండ్ తో కూడా ఈ విషయం చెప్పారు. దీని పైన వెంటనే స్పష్టత ఇవ్వాలని హైకమాండ్ ని కోరుతున్నారు. హైకమాండ్ కూడా ఈ అంశం పై అసలు ఏమి జరుగుతుంది, పాదయాత్ర స్పందన ఏమిటి, ఇలా అన్ని అంశాల పై సమాచారం తెప్పించుకుంటుంది. త్వరలోనే దీని పైన స్పష్టత వచ్చే అవకాసం ఉంది. అసలు సునీల్ దేవదర్ ఎవరి కోసం, ఈ ఆదేశాలు ఇస్తున్నారు అనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. ఈ వార్తలు టీవీలో చూడగానే, జగన్ కోసమే సునీల్ దేవదర్ పని చేస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read