హైకోర్ట్ లో తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వమని ఆదేశిచాలని కోరుతూ, వి-వే-క కూతురు వేసిన రిట్ పిటీషన్ చూస్తే, సంచలన విషయాలు ఉన్నాయి. స్వయానా పెదనాన్న కొడుకు, సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న అన్న పైనే, ఈ ఆరోపణలు చెయ్యటం సంచలనంగా మార్దిని. వైఎస్ సునీత కోర్టుకి ఏమి చెప్పింది? కొన్ని ముఖ్యాంశాలు ఇవి, 1. కడపలో వైఎస్ఆర్ ఎంత పాపులరో మా నాయనా అంతే పాపులర్. సౌమ్యుడూ, అందరికీ అందుబాటులో ఉంటాడన్న మంచిపేరుతో చాలా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. 2. మా నాయన మృ-త-దే-హా-న్ని చూసిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తెదేపాలోని ముఖ్యులకు దీనిని ఆపాదిస్తూ సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసారు. తన పార్టీసహచరులతను వెంటబెట్టుకొని వెళ్ళి గవర్నర్ ను కలిసి సీబీఐ విచారణ చేయించాలని కోరారు. 3. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడిషినల్ డీజీపీ అధికారి అమిత్ గార్గ్ నేతృత్వంలో మొదటి సిట్ టీం ను ఏర్పాటు చేయడం జరిగింది. 4. ఆ తర్వాత మా పెదనాన్న కొడుకూ, నా కజిన్ అయిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి, కొత్త డీజీపీ సవాంగ్ బాధ్యతలు తీసుకున్న 14 దినాల్లో సిట్ ను రీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అడిషినల్ డీజీపీ స్థాయి అధికారిని తప్పించి కేవలం జిల్లా ఎస్పీకి నేతృత్వాన్ని బదలాయించి రెండవ సిట్ ను నీరుగార్చారు.

11) [అమిత్ గార్గ్ ను ఇక్కడ తప్పించారు] రెండవ సిట్ బాస్ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు ఇద్దరు అనుమానితులు ఉదయ్ కుమార్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి లను విచారణకై పులివెందుల నుండి కడపకు తీసుకొని వస్తుండగా మార్గ మధ్యంలో లెక్క లేనన్ని ఫోన్ కాల్స్ రావడం, చివరకు అనూహ్యంగా వారిని కడపకు తీసుకొని రాకుండా వెనక్కు పులివెందుల పంపించి వేయడం జరిగిది. ఎవరి ప్రోద్భలం మేరకు వారిని విచారణకు తీసుకొని రాకుండా మార్గమధ్యంలో వెనక్కి పంపివేయడం జరిగింది? 6. ఇది జరిగిన కొద్ది రోజులకే రెండవ సిట్ బాస్ అభిషేక్ మొహంతి ధీర్ఘకాలిక సెలవుపై ఏ కారణాల వలన వెళ్ళిపోయారు? ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళాక 3 వ సిట్ ను వేసారు.. స్థానిక ఎస్పీ కేకే అంబురాజన్ నేతృత్వంలో. 7. సిట్ కు ఇన్ చార్జ్ గా అభిషేక్ మొహంతీ గారినే కొనసాగించవలసినదిగా డీజీపీని కోరడం జరిగింది. (28-11-2019) . వ్యక్తిగత రక్షణకై 21-11-2019 న డీజీపీని కోరడం జరిగింది. 07-12-2019 న (కేసులో అనుమానితులైన వ్యక్తులే సాక్షులను ఇంటొరాగేట్ చెయ్యడంపై) కడప ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసును సీబీఐ కి బదలాయించే విషయమై మళ్ళీ 11-12-2019 న డీజీపీని కోరడం జరిగింది. 8. ఘటనా స్థలంలో ర-క్త-పు మరకలు శుభ్ర పరచడం వల్ల అప్పుడు అక్కడ విధుల్లో ఉండటంతో సస్పెండయిన సీఐ శంకరయ్యను నిందితుల లిస్ట్ లో ఎందుకు చేర్చలేదు?

9. మూడవ సిట్ కు ఎస్పీ అంబురాజన్ వచ్చినప్పటి నుండీ కేసు దర్యాప్తులో పురోగతి లేదు. గత సిట్ ల దర్యాప్తు వివరాలను తర్వాత వచ్చే వారు పరిగణలోకి తీసుకోవట్లేదు. 10. రెండవ సిట్ చే విచారింపబడిన హెడ్ కానిస్టేబుల్ రామ కృష్ణా రెడ్డి (ర-క్త-పు మరకలు శుభ్రపరిచేటప్పుడు ఘటనా స్థలంలో ఉన్నాడు) ఇప్పుడు తనే సాక్షుల ఇళ్ళకు వెళ్ళి ప్రశ్నలు వేయడం ఎక్కడి విచిత్రం? ఇదే విషయం డీజీపీకి కూడా లేఖ ద్వారా తెలియజేసాము. 11. నా సోదరుడు సీఎం జగన్ గతంలో స్వతంత్ర్య సంస్థ దర్యాప్తును కోరి ఇప్పుడు సీబీఐకు కేసును అప్పగించకపోవడం శోచనీయం. 12. తరచూ సిట్ అధికారులను ఎందుకు మార్చుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ చెప్పట్లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోసం రిట్ పిటీషన్ వేసిన నా సోదరుడు జగన్ ఆ పిటీషన్ ను వెనక్కి తీసుకోనంత వరకూ టెక్నికల్ గా ఆయన సీబీఐ విచారణ కోరుతున్నట్లే లెక్క. ఇప్పుడు తనే సీఎం అయ్యాక సీబీఐను ఈ కేసు విచారించమని కోరకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అమాయకులపై దోషులుగా ముద్ర పడే అవకాశం ఉంది. 13. అనుమానితులు :: అంతా తెలిసిన వారు, బంధువులే.. ముఖ్యమైన వారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మరియూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి డీ. శివశంకర్ రెడ్డి.

అనుమానితుల్లో అందరి కంటే చివరన మొక్కుబడిగా ఆదినారాయణ రెడ్డి, రవీంధ్రనాధ్ రెడ్డి పేర్లు.. అసలు అభియోగాలన్నీ సొంత వారిపైనే. ఈ రిట్ పిటీషన్ చదివితే సీఎం సొంత బాబాయి కూతురే తనకూ తన తల్లికీ న్యాయం జరగడం కోసం ఎన్ని అవస్థలు పడుతుందో అవగతం అవుతుంది.. మరి ఈ విషయం పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read