విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి గురించి తెలియని తెలుగు వాడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పీఠాధిపతి కంటే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన అత్యంత ప్రీతిమంతుడిగా గుర్తింపు ఎక్కువ. రాజకీయ నాయకులే కాదు... అధికారులూ ఆ స్వామి ప్రసన్నం కోసం క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మరి... సాక్షాత్తూ ముఖ్యమంత్రులే వచ్చిపోతుంటే తమదేముందని ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా శారదా పీఠాన్ని దర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పనులైనా విశాఖలోని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని ప్రసన్నం చేసుకుంటే అయిపోతాయనే, రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారనే భావన కలిగేలా ముఖ్యమంత్రులు, మంత్రులు కొంతమంది ఆయన దర్శనం కోసం పోటీపడుతున్నారు.

sunitha 11062019 1

ఇలాంటి మహా మహిమ గల సమిజీ పట్ల, గాయని సునీత ఫైర్ అయ్యారు. ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తన సందర్శకుల జాబితాలో గాయని సునీత కూడా ఉన్నారన్న వ్యాఖ్యపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ఇలా ప్రతి ఒక్కరు తన పేరు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రతిరోజు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తుంటాం. ఈ క్రమంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు. నేనెప్పుడూ అలాంటివి పట్టించుకోకుండా ముందుకెళ్లాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మాత్రం స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే స్పందించాను." - సునీత, గాయని

Advertisements

Advertisements

Latest Articles

Most Read