వివేక కేసు విచరణ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు కీలక వ్యక్తులను విచారిస్తూ, సిబిఐ దూకుడు పెంచింది. ఈ నేపధ్యంలోనే వివేక కుమార్తె వైఎస్ సునీత, నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ తో ప్రత్యెక ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఆ ఛానెల్ అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి కోపం, ఇప్పటికే ఆ ఛానల్ ని బ్యాన్ కూడా చేసారు. ఆ ఛానల్ లో జగన్ గారి సోదరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక పొతే ఈ ఇంటర్వ్యూ లో ఆమె చాలా ఆచి తూచి మాట్లాడారు. ముఖ్యంగా సిబిఐ విచారణ జరుగుతున్న తీరుపై ఏమి మాట్లాడను అని ఆమె చెప్పారు. తాను ఈ సమయంలో మాట్లాడితే విచారణ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మాట్లాడ లేనని అన్నారు. అలాగే సిబిఐ విచారణ తీరు పై పలు అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి కదా అని ప్రశ్నించిగా, ఏది ఏమైనా ఈ సిస్టంలోనే మనం ఉన్నామని, ఈ సిస్టంతోనే పనులు చేయించుకోవాలని, ఈ కేసులో అసలు దోషులు బయటకు వస్తారనే నమ్ముతున్నాను అని, విచారణ జరుగుతుంది కదా, జరగనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఏపి పోలీసులు గురించి కూడా ఆమె మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఇలాంటి సమయంలో, ఈ రాష్ట్ర పోలీసులు మీకు ఎలా సహకరిస్తున్నారు అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.
ఆమె మాట్లాడుతూ, "పరిస్థితి ఎలా ఉన్నా, ఈ రోజుకి కూడా నాకు సిస్టం మీద నమ్మకం ఉంది. ఎన్ని తప్పులు ఉన్నా, మనం ఈ సిస్టంతోనే పని చేయాలి. అందుకే ఈ సిస్టంలో నాకు మంచి జరుగుతుంది అనే ఆశ ఉంది. ఇప్పటికే రెండేళ్ళు అయ్యింది, ఇది తొందరగా అయిపోతుందని అనుకుందాం" అని సమాధనం ఇచ్చారు. ఇక జగన్ పదవిలోకి వచ్చిన తరువాత, మీరు ఆయనతో ఈ కేసు గురించి చర్చించారా, సెక్యూరిటీ అడిగారా అని అడగగా, చర్చించానని సమాధానం ఇచ్చారు. ఆయన నుంచి ఎలాంటి భరోసా వచ్చింది అని అడగగా, నా పరిస్థితి చూస్తున్నారుగా అని, ఏమార్పు లేదు కదా అని బదులు ఇచ్చారు. తన పరిస్థితి చూస్తే ఎలాంటి భరోసా ఉందో అర్ధం అవుతుంది కదా అని బదులు ఇచ్చారు. ఇక విజయసాయి రెడ్డి ముందు గుండెపోటు అని చెప్పారు కదా అని అడగగా, ఇది ఆ రోజు తనకు తెలియదని, తరువాత తెలిసిందని అన్నారు. షర్మిల సహకారం ఉందా అని అడగగా, తన కుటుంబంలో అందరి సహకారం ఉందని, అసలు దోషులు బయటకు రావాలనే అందరూ కోరుకుంటున్నారని అన్నారు.