వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. అన్ని కోణాల్లో విచారణ జరిపిన అధికారులు అసలేంజరిగిందీ? హత్య వెనుక ఉన్నదెవరు? నిజాలను బయట పెట్టేందుకు సిట్ రంగంకూడా సిద్ధం చేస్తోంది. ఇలాంటి సమయంలో వివేకా భార్య, కుమార్తె చేస్తున్న విమర్ళలు చెబుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని జగన్ అంటున్నారు. ఇప్పుడు వివేకా సతీమణి సౌభాగ్య, కుమార్తె సునీతది ఇదే మాట. సిట్ విచారణ బాగా జరుగుతోందని మొదట సునీత చెప్పారు. ఆ తర్వాత ఆమె స్వరం మార్చారు. కొందరు విచారణను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజులు తిరగక ముందే ఇప్పుడు కొత్త మాట ఎత్తుకున్నారు.

sunitha 28032019

సిట్ విచారణ ఏకపక్షంగా జరుగుతోందని సునీత ఆరోపించారు. రేపో మాపో తమ కుటుంబసభ్యులనే నిందితులుగా చూపే ప్రమాదం ఉందంటూ సునీత మీడియా ముందుకు వచ్చారు. సిట్ విచారణపై సునీత ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడటం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సిట్ విచారణ బాగా జరుగుతుందన్న సునీత.. ఆ తర్వాత ఎందుకు మాట మార్చుతున్నారు? ఏకపక్షంగా ఎందుకు జరుగుతుందని అంటున్నారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్నవేళ సునీత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు సరిగా చేయడం లేదని విమర్శించారు.

 

sunitha 28032019

20.3.19 పులివెందుల--- సిట్‌ విచారణ బాగా జరుగుతోంది. అయితే ఎవరి ప్రభావం లేకుండా నిష్పక్షపాత విచారణ కావాలి. అది ఏదైనా పర్వాలేదు. దానికి పేరు ఏదైనా ఉండనివ్వండి. సిట్‌ తన పనిచేస్తోంది. దర్యాప్తులో ఏం గుర్తిస్తుందో చూద్దాం... 25.03.19 --- నాన్న చనిపోయి రోజులు గడుస్తున్నా ఎక్కడా ఎలాంటి క్లూ దొరకడం లేదు. విచారణ సరిగా జరుగుతుందా.. లేదా? అనే అనుమానం కలుగుతోంది. 27.03.19--- మా కుటుంబ సభ్యులను విచారించారు. ఒకవేళ సిట్‌కు అనుమానం ఉంటే బయట పెట్టి ఉంటారు కదా.! ఎందు కు పెట్టట్లేదు? విచారణ సరిగా జరగడం లేదు. వీళ్లే చేశారంటూ రేపో మాపో మా కుటుంబసభ్యులను చూపించే అవకాశం ఉంది. ఆ భయంతోనే చెప్పాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read