నిన్నటి నుంచి ఈ రోజు దాకా, అసెంబ్లీలో హాట్ టాపిక్ రైతులకు సున్నా వడ్డీ రుణాలు. నిన్న కరువు పై జగన్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు, ఎవరూ సున్నా వడ్డీలకు రుణాలు ఇవ్వలేదని, మేమే ఈ పధకం ప్రవేశపెట్టామని చెప్పారు. జగన్ మాట్లాడిన తరువాత, తెలుగుదేశం పార్టీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జగన్ మాటలను తప్పుపట్టారు. సున్నా వడ్డీ అనేది జగన్ ప్రభుత్వమే ముందు మోడల పెట్టలేదని, అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి 2013లో మొదలు పెడితే, తరువాత చంద్రబాబు గారి ప్రభుత్వం కంటిన్యూ చేసిందని చెప్పారు. దీని పై జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్తూ, చంద్రబాబు సున్నా వడ్డీ రుణాలు, రూపాయి అంటే రూపాయి ఇవ్వలేదని, దీని పై నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటూ, ఒకటికి రెండు సార్లు ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ చంద్రబాబుని రెచ్చగొట్టారు. అంతే కాదు, నేను రికార్డులు తెప్పిస్తున్నా, మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిరూపిస్తా, వెంటనే రాజీనామా చేసి చంద్రబాబు వెళ్ళిపోతారా అని ఛాలెంజ్ చేసారు.

దీని పై చంద్రబాబు సమాధనం ఇస్తూ, అన్ని లెక్కలు, డాక్యుమెంట్ లు స్పీకర్ ముందు పెట్టి, తాము 960 కోట్లు సున్నా వడ్డీ రుణాల కింద ఖర్చు పెట్టామని, ఆ వివరాలు సభ ముందు పెట్టారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఎదురు దాడి మొదలు పెట్టారు. చంద్రబాబు ఇచ్చింది కేవలం 5 శాతం మాత్రమే అని, అదేదో గొప్పగా ఇచ్చినట్టు, ఆహా, ఓహో అంటూ చెప్తున్నారని చెప్పారు. నేను ఏదో మాట వరుసకు, రూపాయి ఇవ్వలేదు అన్నానని, దాన్ని పట్టుకుని, ఇంత సాగదీస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారు. అయితే, ఇక్కడితో చర్చ ముగిసింది. వెంటనే బుగ్గన గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందరూ జగన మోహన్ రెడ్డి గారు, ఎన్ని వేల కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారో అని ఆశగా ఎదురు చూస్తుంటే, బుగ్గన గారు చెప్పింది, వడ్డీ లేని రుణాల కింద, 100 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మరి, ఇప్పుడు జగన్ గారిని, ఆహా, ఓహో అనాలా ? నిన్న ఒక్క రూపాయి ఇవ్వలేదని ఛాలెంజ్ చేసారు, ఈ రోజు ఉదయం ఇంత తక్కువా అని చంద్రబాబు ఎద్దేవా చేసి, మధ్యాహ్నం చంద్రబాబు కంటే తక్కువగా 100 కోట్లు కేటాయించారు. ఇలా ఉంది మన జగన్ గారి, పూటకు ఒక తీరు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read