చైనా ప‌ర్య‌ట‌న‌కు లోకేష్‌ని ఎవ‌రూ పిల‌వ‌లేద‌ని, రూ.30 కోట్లు ఖ‌ర్చు పెట్టి స్లాట్‌ కొనుక్కున్నాడు అంటూ, అటు జగన్, పవన్, బీజేపీ కలిసి, రెండు నెలల క్రిందట ఎలా హేళన చేసారో తెలిసిందే. అయితే, అప్పుడే వీళ్ళ నోరు మూపిస్తూ, వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం, లోకేష్ కి పంపిన ఆహ్వానంతో పాటు, వివిధ డాక్యుమెంట్ లు చూపించటంతో నోరు మూసారు. ఇది పక్కన పెడితే, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సెప్టెంబర్ లో లోకేశ్‌ చైనా పర్యటన ఫలితాన్ని ఇస్తుంది. ఆ పర్యటనలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ టీసీఎల్‌ తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, చైనాకు చెందిన మల్టీనేషనల్‌ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీ ‘సన్నీ ఆప్టికల్స్‌’ రాష్ట్రంలో రూ.500కోట్లతో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. తద్వారా 2500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

lokesh 04122018 1

చైనా పర్యటనకు వెళ్లిన సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సదరు కంపెనీ ఉప డైరక్టర్‌ ఆరాన్‌తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి వివరించి... పూర్తి సహకారం అందిస్తామని, రాష్ట్రానికి రావాలని కోరారు. దీంతో సన్నీ ఎలక్ర్టానిక్స్‌ రాష్ట్రానికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మంగళవారం నాడు లోకేశ్‌ సమక్షంలో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం జరగనుంది. కెమెరా మాడ్యుల్స్‌, ఆప్టికల్‌ కాంపొనెంట్స్‌ తయారీలో సన్నీ ఆప్టికల్స్‌కు మంచి పేరుంది. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు హువాయ్‌, జియోమీ, ఒప్పో, వివో, లెనోవో, సోనీ, పానాసోనిక్‌, ఒలంపస్‌, కార్ల్‌జిస్‌ లాంటి కంపెనీలకు ఆప్టికల్‌ కాంపొనెంట్స్‌ను సన్నీ ఎలక్ర్టానిక్స్‌ తయారుచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 28వేల మంది పనిచేస్తున్నారు.

lokesh 04122018 1

మొబైల్‌ ఫోన్లు, టీచింగ్‌ సపోర్ట్‌, ఆప్టికల్‌ ఇమేజింగ్‌ సేవలను సన్నీ ఆప్టికల్స్‌ అందిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 15వేల మంది ఒకేచోట పనిచేసేలా ఫాక్స్‌కాన్‌ కంపెనీని తీసుకురాగా.. తిరుపతిలో రానున్న రిలయన్స్‌ సెజ్‌లో దాదాపు 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరో పక్క, విశాఖలో ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌(ఐ-హబ్‌) ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను యునెస్కో స్వాగతించింది. డిజిటల్‌ మేథా సంపత్తికి సంబంధించి ఐ-హబ్‌ ఏర్పాటుచేసేందుకు 50 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ఇటీవల విశాఖలో జరిగిన టెక్‌-2018 సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. యునెస్కోకు అనుబంధంగా పనిచేస్తున్న మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌(ఎంజీఐఈపీ) సంచాలకులు ఆచార్య డాక్టర్‌ అనంత దురైయ్యప్ప దీనిపై చంద్రబాబుకు లేఖ రాశారు. యునెస్కో ఎంజీఐఈపీ-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందంతో ఐ-హబ్‌ ఏర్పాటు... గ్లోబల్‌ డిజిటల్‌ విద్యా విధానాలను విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీతో తాము ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read