ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోకపోవడంపై.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. ఎన్నికల సంఘం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘అసలు మీరేం చేస్తున్నారు. ఎంత మందికి నోటీసులు పంపారు. మీ అధికారాలు ఏంటో మీకు తెలుసా? ఒక వేళ సరైన సమాధానాలు ఇవ్వకపోతే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను పిలవాల్సి వస్తుంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ మాట్లాడుతూ.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా.. ఈ కేసు క్లోజ్ అయ్యిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఈసీ ప్రతినిధి హాజరు కావాలని.. కుల, మతపర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ec 15042019

అయితే, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతిపై ఈసీ కొరడా ఝళిపించింది. ఎన్నికల వేళ ఇరువురు నేతల ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న యోగి ఆదిత్యనాథ్‌, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అ అంశాన్ని పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. ఫిర్యాదులు అందినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 7న ఇద్దరు నేతలూ మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసీ కనీసం ప్రస్తావించడంగానీ, దానిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన గానీ చేయలేదని.. దీనిపై న్యాయస్థానం జోక్యంచేసుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది.

ec 15042019

మతపరమైన, సైనికపరమైన, దేశభద్రతకు సంబంధించిన అంశాలపై రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రసంగాల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అసలు ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ఇలాంటి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించింది. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసిన ఒకట్రెండు గంటల్లోనే ఈసీ చర్యలు చేపట్టింది. మతపరమైన వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ఉదయం 6గంటల నుంచి 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యలుచేసిన మాయావతిపై 48గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయవద్దని ఆంక్షలు విధించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read