ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై 30కి పైగా సీబీఐ, ఈడీ కేసులు నమోదైన విషయం దేశమంతటికీ తెలుసు. న్యాయశాస్త్ర పాఠాలలో జగన్ రెడ్డి పాల్పడిన క్విడ్ ప్రోకో నేరాలపై పాఠాలు కూడా ఉన్నాయి. ఈ కేసుల విచారణ ముందుకు సాగకుండా డిశ్చార్జి పిటిషన్లు, వాయిదాలు, కోర్టుకి హాజరు కాకపోవడాలు వంటి చాలా జగన్ నాటకాలు ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. జగన్ రెడ్డి పాల్పడిన నేరం విలువ పదేళ్ల క్రితం 43 వేల కోట్లు. అంటే సీబీఐ, ఈడీ గుర్తించినదే 43 వేల కోట్లంటే..అది ఇప్పటి విలువ ప్రకారం చూసుకున్నా, సీబీఐ ఈడీలకు దొరకని దోపిడీ సొమ్ము లెక్కేసుకున్నా లక్షల కోట్లు ఉంటుంది. ఇంత తీవ్రమైన కేసుల్లోనూ విచారణ నత్తనడకన ఎందుకు సాగుతోందో అందరికీ తెలుసు. ప్రజాప్రతినిదులపై కేసులు ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్న జగన్ కేసుల విచారణ ముందుకు సాగడంలేదు. ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై గట్టిగా నిలదీసింది. ఆర్థిక కుంభకోణాల కేసులను విచారించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడిన వారు వేలకోట్ల ప్రజాధనం దోపిడీకి పాల్పడినట్టేనని, దర్యాప్తులో ఉదాశీనత ఎందుకు అని సీబీఐ, ఈడీలను సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కేసు విషయంలో ఈ వ్యాఖ్యలు చేసినా, సీబీఐ-ఈడీ నమోదు చేసిన ఆర్థిక కుంభకోణం కేసులు వైఎస్ జగన్ రెడ్డిపై లెక్కకు మించి వుండటంతో తాడేపల్లి ప్యాలెస్లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
సీబీఐ, ఈడీ పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ వైసీపీ
Advertisements