ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క-రో-నా సహాయం కోసం ఇచ్చిన సొమ్మును వేరే పథకాలకు ఖర్చు చేసిందని పిటిషనర్ సుప్రీం కోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు చేసారు. కేంద్రం క-రో-నా మృతుల కుటుంబాలకు ప్రకటించిన నిధులను ఏపి ప్రభుత్వం ఎలా దారి మళ్ళిస్తారు అంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన రూ.1100 కోట్లను క-రో-నా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా మీరు వేరే వాటికి ఎందుకు ఖర్చు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సుప్రీం కోర్ట్ సీరియస్ అయ్యి, వార్నింగ్ ఇచ్చింది. దీని పై మే 13 తారీఖు లోగా పరిహారంకు సంభందించిన వివరణతో అఫిడవిట్ దాఖలు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే మీకు ఆఖరి సారి చెప్పడం అని , ఇంకోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామలు ఎదుర్కోవడానికి ఏపి ప్రభుత్వం సిద్దంగా ఉండాలని సుప్రీం కోర్ట్ ఘాటుగా హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాయించి పడేసిన సుప్రీం కోర్ట్...
Advertisements