నేర చరితులు, కళంకితులకు ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం పై రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. నేర చరితులకు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా నిరోధించడానికి సరికొత్త విధానం తీసుకొచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపినేత సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చట్టింది. రాజకీయ పార్టీలకు న్యాయ స్థానం కీలక సూచనలు చేసింది. క్రిమినల్ రికార్డులు ఉన్నవారికి ఎందుకు టికెట్లు కేటాయి స్తున్నారో కల కారణాలను తమ పార్టీల అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచాలని సూచిం చింది. నేర చరితులకు టికెట్లను కేటాయించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గతంలో వలు ఆదేశాలు జారీచేసినా అంతగా ఫలితం లేకపోయింది. ఈ అంశాన్ని మరోసారి పరిశీలించడానికి ఇటీవల సమ్మతించిన సుప్రీం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యను నియంత్రించడానికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉన్నట్లు ఎన్నికల సంఘం అభిప్రాయపడుతున్నట్లు జసిస్ ఆర్ఎఫ్ నారిమన్ జస్టిస్ ఎ రవీంద్రభట్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాజకీయాల నుంచి నేరస్తులను పారద్రోలడానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఎలాంటి ప్రభావం చూపించలేదని ధర్మాసనం వెల్లడించింది. గత నెల 24నాటి విచారణ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్, పిటిషనర్ ఉపాధ్యాయను దీనికి సంబంధించి ఓ ప్రతిపాదన రూపొందించి వారం రోజుల్లో సమర్పించాలని ధర్మాసనం సూచించింది. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నా దోషిగా నిర్ధారించబడని వ్యక్తిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించడం అంటే రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించడమే అవుతుందని ఏదేమైనా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీలు తమపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే తప్పనిసరిగా నామినేషన్ పత్రాల్లో పొందుపరచాలని 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని అమలుచేయడం లేదంటూ తాజాగా అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసారు. రాజకీయ పార్టీలు తమతమ వెబ్ సైట్ లో ఈ వివరాలను సైతం పొందుపరిచేవిధంగా ఆదేశాలు జారీచేయాలని ఆయన కోరారు. అయితే ఇప్పుడు ఈ ఆదేశాలు జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తిగా, అయన పై 31 కేసులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు పై, ఒకే ఒక్క కేసు, అది కూడా బాబ్లీ కేసు ఉంది. ఇప్పటికీ, శుక్రవారం కోర్ట్ కు వెళ్తున్న జగన్, ఈ కొత్త ఆదేశాలతో, మరింతగా ప్రజల్లో చులకన అయ్యే అవకాసం ఉందని, అలాగే తమ పార్టీ నుంచి 80 మందికి పైగా ఉన్న కేసులు గురించి కూడా వెబ్ సైట్ లో వెయ్యాలని, వైసీపీ ఇబ్బంది పడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read