సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చట్టాలు, రాజ్యాంగం, వ్యవస్థలకు తాను అతీతుడినని భావిస్తూ ఉంటారని చంద్రబాబు అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ ఉంటారు. కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అవినీతి కేసులు పీకల వరకూ జగన్ మునిగి ఉన్నారు. ఈ కేసుల విచారణ సాగకుండా రకరకాలుగా న్యాయవ్యవస్థలోని మార్గాలను అనుసరిస్తున్నారని న్యాయకోవిదులు చాలా సందర్భాలలో చెప్పారు. అధికారంలోకి వచ్చాక కూడా కోర్టులు అభిశంసించినా పై కోర్టుకెళ్లి అక్షింతలు వేయించుకోవడం షరామామూలైపోయింది. జగన్ సర్కారు పెడధోరణికి నిదర్శనం దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసుల రికార్డు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, జీవోలు ఎంత అడ్డగోలుగా ఉంటున్నాయంటే, కోర్టులు మారినా తీర్పులు మారడంలేదు. రోజూ ఏదో ఒక శాఖకి చెందిన ఉన్నతాధికారి కోర్టు బోనులో నిలుచోవాల్సి వస్తోంది. తాజాగా బ్రిటిష్ కాలం నాటి చట్టం దుమ్ము దులిపి తెచ్చిన జీవో 1ని హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇదివరకూ హైకోర్టు తీర్పులపై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం ఒక్క కేసులోనూ విజయం సాధించలేదు. అతడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ బాబుని కమాన్ హిట్ మీ అని ప్రొవోక్ చేస్తాడు. మహేష్‌బాబు కొట్టడానికి జంకుతాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పార్థు కొడితే కానీ వదలడు కొట్టవయ్యా అంటాడు. సేమ్ ఇలాగే జగన్ సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే గానీ తనవి తప్పుడు నిర్ణయాలని ఒప్పుకోరేమో మరి. తాజాగా ఏపీ హైకోర్టు తమ తీర్పుని అమలు చేయని ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణలకు జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పులు ఏపీ సర్కారుకి నిరంతర ప్రక్రియగా మారింది.
సుప్రీం కోర్టులో ఏమి జరగబోతుంది ? రాష్ట్రమంతా వైటింగ్...
Advertisements