కర్ణాటకలో అమిత్ షా, మోడీ చేస్తున్న దారుమైన ప్రజాస్వామ్య ఖూనీ అడ్డుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి సుప్రీమ్ కోర్ట్ మెట్లు ఎక్కింది. దీంతో కర్ణాటక రాజాకీయలు నేపధ్యంలో హైడ్రామా చోటు చేసుకుని. ప్రభుత్వం ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నరు ఆహ్వానించడం పై కాంగ్రెస్‌ సుప్రీం కోర్టుకెక్కింది. కోర్ట్ కి వెళ్ళకుండా రాత్రి 9 గంటలకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి, ఉదయం 9:30కి ప్రమాణస్వీకారం చేస్తున్నారని, అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కాంగ్రెస్‌ సీనియరు నేత, న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టును కోరారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బుధవారం రాత్రి 11:47 గంటలకు అత్యవసరంగా ఓ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై అప్పటికప్పుడే వాదనలు వినాలని అభ్యర్థించింది. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వి, వివేక్‌ తనఖా, పార్టీ లీగల్‌సెల్‌కు చెందిన లాయర్లు- కృష్ణ మీనన్‌ మార్గ్‌లో ఉన్న చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నివాసానికి రాత్రి 12:28 గంటలకు చేరుకున్నారు.

supreme 17052018 2

కర్ణాటకలో ఓ అనైతిక ప్రభుత్వం కొలువుదీరబోతోందని, గురువారం ఉదయం 9:30కే ప్రమాణస్వీకారమని, దీన్ని తక్షణం ఆపాలని, సుప్రీం జోక్యం అనివార్యమని అభ్యర్థించారు. గవర్నర్‌ నిర్ణయం చెల్లదని ప్రకటించాలని, ఈ ప్రక్రియ నిలుపుచేయాలని అభిషేక్‌ మనుసింఘ్వి కోరారు. సీజే తొలుత విముఖత ప్రదర్శించినా తరువాత వెంటనే వాదనలు వినడానికి అంగీకరించారు. అర్ధరాత్రి 1:45కి ఆరో నెంబరు కోర్టులో విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. జస్టిస్‌ ఏకీ సిక్రీ నేతృత్వంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన బెంచ్‌కు ఈ వ్యవహారాన్ని కేటాయించారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంయుక్తంగా వేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీజే దీనికి సంబంధించిన వాదనలను లిఖిత పూర్వకంగా వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

supreme 17052018 3

కోర్టులో న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఉన్నవారినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని వాదనలు వినిపించారు. బలనిరూపణకు 15 రోజుల సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశమిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యవహారంలో గతంలో కోర్టు 48 గంటల సమయమే ఇచ్చిందని చెప్పారు. ‘‘కాంగ్రెస్-జేడీఎస్ ల బలం 116 మంది ఎమ్మెల్యేలు. బీజేపీ బలం 104. మరి గవర్నర్‌ ఎందుకు మెజారిటీ ఉన్న కాంగ్రె్‌స-జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు? గవర్నర్‌ నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, సంప్రదాయ విరుద్ధం. ఈ నిర్ణయం చెల్లదని ప్రకటించాలి. మెజారిటీ ఉన్న కూటమి నేత హెచ్‌డీ కుమారస్వామిని ఆహ్వానించేట్లు గవర్నర్‌ను ఆదేశించాలి’’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

మెజారిటీ నిరూపించుకోవడానికి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక పార్టీని గవర్నరు పిలవకుండా కోర్టు అడ్డుకోగలదా? అని కూడా అడిగింది. అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? అని ప్రశ్నించింది. గతంలో గవర్నరు చర్యను అడ్డుకున్న సందర్భముందని సింఘ్వీ సమాధానమిచ్చారు. గతంలో ఇచ్చిన తీర్పులు గవర్నరుకు వ్యతిరేకంగా, ఆయనను అడ్డుకోవడానికి ఇచ్చినవి కావని కోర్టు అభిప్రాయపడింది. రెండు గంటలు వాదనలు విన్న కోర్ట్, గవర్నర్ అధికారాలని అడ్డుకోలేము అని, తేల్చి చెప్పింది. దీంతో ఈ రోజు ప్రమాణస్వీకారం ఏ అడ్డంకులు లేకుండా జరగనుంది... అయితే, కేసు ఇంకా డిస్మిస్ చెయ్యలేదు. రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు మళ్ళీ విననుంది. అంతకంటే ముందు, గవర్నర్ కు ఎడ్యురప్ప ఇచ్చిన లేఖ, ఎంత మంది మద్దతు ఉంది, ఇవన్నీ చూపించాలని సుప్రీం కోర్ట్ కోరింది. ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడే ఉంటుందని కోర్ట్ చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read