హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఎట్టకేలకు ఒక కేసులో ఊరట లభించింది. విజయవాడ స్వర్ణా ప్యాలెస్ ఘటనలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై, బాధ్యులు పేర్లు లేకుండా, కేవలం కొంత మందినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్తూ, ఈ ఘటనలో సంబంధం ఉన్న అందరి బాధ్యుల పేర్లు కూడా తేల్చండి అంటూ, అప్పటి వరకు ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే పై, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఇచ్చిన స్టే పై, ఆదేశాలు ఇస్తూ, ఆ స్టే ఎత్తివేసి, విచారణ చేసుకునే అవకాసం ఇవ్వాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు వద్ద పిటీషన్ వేసింది. ఈ కేసు పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు పై విచారణ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ప్రభుత్వానికి ఊరట ఇచ్చే అంశం అయినా, ప్రభుత్వం టార్గెట్ మాత్రం డాక్టర్ రమేష్ అనే విషయం, ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి చూసిన వారికి అర్ధం అవుతుంది.

ఈ ఘటన మొత్తానికి డాక్టర్ రమేష్ బాధ్యుడు అనేది ప్రభుత్వం అభిప్రాయం. అయితే సుప్రీం కోర్టు మాత్రం, డాక్టర్ రమేష్ ని కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయన్ను నిర్బందించకుండా, విచారణ చేసుకోవచ్చని, అలాగే డాక్టర్ రమేష్ కూడా విచారణకు సహకరించాలని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి, అంటిసిపేటరీ బెయిల్ కోసం ఎవరైనా ప్రయత్నం చేసుకుంటే, అది హైకోర్టు చూసి, తగిన ఆదేశాలు ఇవ్వచ్చు అంటూ సుప్రీం తన తీర్పులో తెలిపింది. ఈ తీర్పు ఒక రకంగా ప్రభుత్వానికి విజయమే అయినా, డాక్టర్ రమేష్ ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే మోటివ్ మాత్రం కుదరలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదీ కాక ఈ ఘటన హోటల్ లో జరిగింది, ఆ హోటల్ యజమాని బాధ్యులు అవుతారు, అలాగే అక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారులు బాధ్యులు అవుతారు, కానీ అక్కడ వైద్యం చెయ్యటానికి వచ్చిన డాక్టర్ రమేష్, అగ్ని ప్రమాదానికి బాధ్యులు ఎలా అవుతారు అనేది, కూడా ప్రశ్న. ఏది ఏమైనా, ఈ ఘటనకు డాక్టర్ రమేష్ బాధ్యుడు అనే ఆధారాలు ఉంటే ఆయన్ను శిక్షించాలి, లేకపోతే ఎవరు బాధ్యులు అయితే వారి పై చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read