ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నియామకం విషయంలో, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరితో వివాదం కొనసాగుతూనే ఉంది. నిమ్మగడ్డను తొలగించిన విషయం పై, నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్ళగా, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసి, నిమ్మగడ్డ నియామకం పై ఆదేశాలు ఇచ్చింది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టులో చాలెంజ్ చేసింది. దీని పై గత వారమే ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేసినా, అందులో తప్పులు ఉండటంతో, పిటీషన్ వెనక్కు తీసుకుని, మళ్ళీ తప్పులు సరి చేసి, కొత్త పిటీషన్ దాఖలు చేసింది. దీని పై, ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందే ఈ రోజు విచారణ జరిగింది. అయితే హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే కావలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం కోరగా, సుప్రీం కోర్టు మాత్రం, స్టే ఇవ్వటానికి మేము ఒప్పుకోం అంటూ, కేసును రెండు వారాలకు వాయిదా వేస్తూ, ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చింది.

కౌంటర్ దాఖలు చెయ్యాలని, రెండు వారాలు టైం ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఈ సందర్భంగా, సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యంగబద్ధ సంస్థలతో, ఆటలు ఆడుకోవద్దు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యంగ విరుద్ధంగా మీరు ప్రవర్తించారు, రమేష్ కుమార్ ని తీసెయ్యటానికే ఈ ఆర్డినెన్స్ తీసుకోవచ్చారు అంటూ, హైకోర్టు చేసిన వ్యాఖ్యల పై, సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంది. ఆర్డినెన్స్ జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు నమ్మదగినవిగా లేవని సుప్రీంకోర్టు చెప్పింది. ఇందులో స్టే ఇవ్వటానికి ఏమి లేదని, అయితే కేసు మాత్రం, వింటాం అని, నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా, రాజ్యాంగపదవుల్లో ఉన్నవారితో ఆటలొద్దన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read