నిన్న సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు, రాజధాని అమరావతి రైతులకు ఆయుధంగా మారాయి. సుప్రీం ఆదేశాలను, ఇక్కడ కూడా పోలీసులు తుంగలోకి తొక్కుతున్నారని, ఏపి పోలీసుల పై, సుప్రీంలోనే తేల్చుకుంటామని రాజధాని రైతులు అంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛను, ప్రజా ఉద్యమాలను, అణిచివేయటానికి, దేశవ్యాప్తంగా, ప్రభుత్వాలు ఇస్తానుసారంగా, 144 సెక్షన్ ప్రయోగిస్తున్న నేపధ్యంలోం, నిన్న సుప్రీ కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ-కశ్మీర్లో పెడుతున్న ఆంక్షల పై సుప్రీం స్పందిస్తూ, అత్యవసరంగా ప్రమాదం ఉంటే తప్ప 144 సెక్షన్ ప్రయోగించడానికి వీల్లేదని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే, వారిని అణచివేయడానికి 144 సెక్షన్ ప్రయోగించటం చూస్తుంటే, ఇది అధికారాన దుర్వినియోగానికి పాల్పడటమేనని జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. 144 సెక్షన్ తో, ప్రజల ప్రాథమిక హక్కుల పై, ప్రభావితం చూపుతాయని, సుప్రీం కోర్ట్ చెప్పింది. ఈ హక్కులను నియంత్రించేందుకు, ఏకపక్షం నిర్ణయాలు తీసుకోకూడదని కోర్ట్ తెలిపింది.
అలాగే, ఇంటర్నెట్ సదుపాయాలు పొందడం కూడా ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని 19 అధికరణ కింద జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం అంతర్జాల సేవలపై సమీక్షించాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన త్రిసభ్య బెంచ్ ఆదేశించింది. ఇంటర్నెట్ సదుపాయం ప్రాథమిక స్వేచ్ఛ కిందకే వస్తుందన్న ధర్మాసనం వారం రోజుల్లో దీనిపై సమీక్షించి అడ్డంకులు తొలగించాలని స్పష్టం చేసింది. ఐపీసీలోని 144 సెక్షన్ (నిషేధాజ్ఞలు) ప్రయోగించి వాక్ స్వాతంత్రంపై నిరవధికంగా అణచివేతకు దిగడంపై బెంచ్ ఆక్షే పణ తెలిపింది. మీడియాపై ఆంక్షలను బెంచ్ తప్పుపట్టింది.
ఆంక్షలు విధించే టప్పుడు మెజిస్ట్రేట్లు ఔచిత్యం ప్రదర్శించాలని, ఎవరికి ఆపాలి, ఎవరికి ఉంచాలి అన్న విషయం ఆలోచించాలని కోర్టు పేర్కొంది. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దుచేసిన తరువాత కాశ్మీర్ పై కేంద్రం అనేక రకాలు ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత కీలకమైం దని న్యాయవాది బ్రిందా గ్రోవర్ అన్నారు. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండటంతో, ఇప్పుడు రాజధాని రైతులు, సుప్రీం తీర్పుతో, ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎదుర్కుంటామని చెప్తున్నారు. శాంతియుతంగా మేము నిరసనలు తెలుపుతుంటే, 144 పెట్టి అడ్డుకుంటున్నారని, చివరకు గుడికి కూడా వెళ్ళనివ్వక పోవటం పై, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సుప్రీంలోనే తేల్చుకుంటామని చెప్తున్నారు.