ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారి కేసులని, ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి, ఏడాదిలోపు విచారణ చెయ్యాలనే సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు కావటం లేదు అంటూ, అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ అనే ఒక పౌరుడు, సుప్రీం కోర్టులో కేసు వేసారు. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు, అమికస్‌ క్యూరీని నియమించింది. అమికస్‌ క్యూరీ అంటే కోర్టుకు సహాయకుడు. హన్సారియా అనే వ్యక్తిని అమికస్‌ క్యూరీగా నియమించింది. ఆయన దేశం మొత్తం నేరారోపణలు ఉండి, కేసులు ఉండి చట్ట సభల్లో ఉన్నవారి జాబితాను సుప్రీం కోర్టు ముందు పెట్టి, అనేక విషయాలు చెప్తూ, సలహాలు ఇస్తూ, కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా 4442 తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పై కేసులు ఉన్నాయి. ఇందులో, 2556 మంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పై కేసులు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉత్తర ప్రదేశ్ లో అత్యధికులు ఉన్నారు ఇక మన రాష్ట్రానికి తీసుకుంటే, 106 మంది పై కేసులు ఉన్నాయి. ఆరుగురు సిట్టింగ్ ఎంపీలు, 79 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మాజీ ఎంపీలు, 53 మంది మాజీ ఎమ్మెల్యేల కేసులు ఉన్నట్టు, సుప్రీం కోర్ట్ కు నివేదిక సమర్పింకాహారు.

ఇందులో చాలా మందికి 188 of IPC సెక్షన్ కింద కేసులు నమోదు అయ్యాయి. అంటే నేరం రుజువు అయితే, రెండేళ్ళ జైలు శిక్ష పడుతుంది. మరి కొంత మందికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాసం ఉంది. కొన్ని కేసులు అయితే గత 10 ఏళ్ళు నుంచి పెండింగ్ లో ఉన్నాయని, సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇక ఈ అఫిడవిట్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో జస్టిస్ ఎన్.వి. రమణ బెంచ్ ముందు విచారణ జరిగింది. ఆరోపణలు ఉన్న ప్రజాప్రతినిధుల పై వైఖరి చెప్పమంటూ, సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ఆరోపణలు ఉన్న వారికి ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించాలన్న అంశంపై వైఖరి తెలపాలని నోటీసులు ఇచ్చింది. ఆరు వారల లోగా తమ అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇదే జరిగితే, మన రాష్ట్రంలో చాలా పెద్ద తలకాయలు ఎన్నికల్లో పోటీకి లేకుండా ఆనర్హులు అవుతారు. అలాగే ఏడాది లోపు విచారణ అయిపోతే, ఎంతో మంది లోపలకు వెళ్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read