నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...

polavaram 3007210218 2

దీంతో కొంత మంది పెద్దలకు కన్ను కుడుతుంది.. అందుకే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలాగైనా ఆపి, చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ తియ్యాలి అనే ప్లాన్ వేస్తున్నారు... దీంట్లో భాగంగా, ఒరిస్సా, తెలంగాణా రాష్ట్రాల చేత, పోలవరం ఆపెయ్యాలి అంటూ సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ వేసారు. పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌ పై గత నెల రోజులుగా సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా వాదించింది. అనుమతులకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు జరగడం లేదని, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పుకు కూడా విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాదించింది.

polavaram 3007210218 3

ఈ రోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకు ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం పై ఇతర రాష్ట్రాల సమస్యలను బుధవారంలోపు విడివిడిగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నివేదిక ఇవ్వని రాష్ట్రాలకు పోలవరంతో సమస్యలు లేనట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. కాగా తమ వాదనతో కర్నాటక, మహారాష్ట్ర ఏకీభవిస్తున్నాయన్న ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే గతంలో ఏఏ అంశాలపై వాదనలు వినిపించారో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఒరిస్సా, తెలంగాణా, ఏ రకమైన వాదనలతో సుప్రీం కోర్ట్ ముందుకు వస్తాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read