చేసిందే పిచ్చి పని. ఆ పిచ్చి పనిని హైకోర్ట్ కొట్టేసింది. వాదనలు సమయంలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అయినా హైకోర్ట్ ని కాదని, తమ పని కరెక్ట్ అని చెప్పుకోవటానికి, సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. ఇప్పుడు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇష్టం వచ్చినట్టు, ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది అంటూ, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పనిని సమర్ధించుకోవటానికి, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటమే పెద్ద తప్పు అని అంటున్నారు. ఇక విషయానికి వస్తే, మన రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కనిపించిన ప్రతిదానికి, వైసీపీ రంగులు వేసుకుంటూ వెళ్ళిన సంగతి తెలిసిందే. పంచాయతీలు, ప్రభుత్వ భవనాలు, స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలు, ఇలా ప్రతి దానికి రంగులు వేసారు. ఇక చివరకు గేదల కొమ్ములు, చెట్ల ఆకులకు కూడా వైసీపీ రంగులు వేసి విరక్తి పుట్టించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ వెళ్ళే పంచాయతీ భవనాలకు, వైసీపీ రంగులు వేసి, దాన్ని పార్టీ ఆఫీస్ గా మార్చటం పై, తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.

ప్రజలు ఎంత వ్యతిరేకించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కొంత మంది ఇదే విషయం పై హైకోర్ట్ కు వెళ్లారు. దీంతో హైకోర్ట్ వాదనాలు సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము కూడా కోర్ట్ ల్లో మా ఫోటోలు పెట్టుకోమా ? ప్రధాని కూడా అలాగే పెట్టుకున్నారా ? అని వ్యాఖ్యలు చెయ్యగా, అసలు అది పార్టీ రంగులే కాదు అని వాదించారు. దీంతో హైకోర్ట్, వైసీపీ పార్టీ జెండా తీసుకుని రమ్మని చెప్పింది. ఇక ఆ వాదనలు ముగిసిన తరువాత, హైకోర్ట్ పోయిన వారం, ఈ రంగుల పై తీర్పు ఇస్తూ, 10 రోజుల్లో, ఆ రంగులు తియ్యాలని ఆదేశాలు ఇచ్చింది. చీఫ్ సెక్రెటరి చెప్పిన రంగులు వెయ్యాలని , ఆదేశాలు ఇచ్చింది.

అయితే అనూహ్యంగా, ప్రభుత్వం ఈ నిర్ణయం పై కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. దీని పై ఈ రోజు సుప్రీం కోర్ట్ లో వాదనలు జరిగాయి. దీంతో, సుప్రీంకోర్టులోజగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.- పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. రంగులు తొలగించాలంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా - సీజేఐ బాబ్డే, న్యాయమూర్తులు నాగేశ్వరరావు, సూర్యకాంత ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు, కాషాయం రంగు వేస్తే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించింది. అయినా, ఈ విషయం పై కూడా జగన్ ఎలా సుప్రీం కోర్ట్ కు వెళ్లారు అంటూ, ఆశ్చర్యపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read