స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో సర్వత్రా సందిగ్ధత నెలకుంది. ఎన్నికల వాయిదా నిర్ణయం కొనసాగుతుందా. ,కోర్టు కొట్టివేస్తుందా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను యథాతథ స్థితిలో వాయదా వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఏపీ సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసీ నిర్ణయాన్ని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేసారు. గవర్నర్ ఆయనను రాజభవనకు పిలిపించి మాట్లాడారు. తరువాత ఈ విషయం పై సుప్రీం కోర్ట్ లో కేసు వేసారు. అయితే, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆరు వారల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్న తీసుకున్న నిర్ణయం తాము కలుగ చేసుకోలేం అంటూ, సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆరు వారల తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, కొత్త తేదీలు ప్రకటించాలని చెప్పింది. అయితే కొత్త పధకాలు ప్రకటించ కూడదు అని, కొత్త తేదీలు ప్రకటించిన తరువాత, నాలుగు వారాల ముందు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని చెప్పింది.

ఎన్నికల కమీషనర్ ఆరు వారాలు వాయిదా వెయ్యటంతో, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఇదే సందర్భంలో హైకోర్టులోను ప్రజా వాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మరో పక్క రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి సిఎస్ నీలం సాహ్ని లేఖ రాసారు. ఎన్నికల నిర్వహణ వాయిదాను విరమించుకోమని ఆమె ఆయనకు విజృప్తి చేసారు. ఈ పరిణామాల నడుమ ఈ అంశంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి జగన్ కూడా ఆలోచన చేసారు. మాజీ ఎన్నికల కమీ షనర్ రమాకాంత్ రెడ్డితో ఆయన సమాలోచనలు చేసారు. మంత్రులు పెదిరెడ్డి రామచంద్రరెడ్డి,బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన రమాకాంత్ రెడ్డితో సమావేశమై పలు సూచనలు తీసుకున్నారు.

ఎన్నికల వాయిదాకు రమేష్ కుమార్ తన అధికారాలకు సంబంధించి చెబుతున్న సెక్షనులు ఏమీ రాష్ట్ర ఎన్నికల అధికారికి వర్తించవని ఈ సందర్భంగా రమాకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. నిజానికి అవన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోని సెక్షనులని స్పష్టం చేసారంటున్నారు. ఎన్నికల అధికారి విచక్షణాధికారాన్ని ప్రశ్నించడమనే అంశాన్ని పక్కన పెడితే, ఖచ్చితంగా ఎన్నికల కమీషనర్ ఒక వివత్తు సందర్భంలో నిర్ణయం తీసుకునేటప్పుడు విధిగా గవర్నర్ అనుమతిని తీసుకోవడం, ప్రభుత్వానికి వివరించడం చేయాలని రమాకాంత్ రెడ్డి స్పష్టం చేసారంటున్నారు. ఒక వేళ రాష్ట్ర ఎన్నికల అధికారి ఏదైనాకోర్టు తీర్పు ను ఉదాహరించి తాను అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్ని కల అధికారి మాదిరిగా తనకు అధికారాలున్నాయని వాదించినా, తప్పని సరిగ్గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాలని రమాకాంత్ రెడ్డి వివరించారంటున్నారు. అయితే ఈ రోజు సుప్రీం మాత్రం, ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read