వైఎస్ఆర్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే, 12 ఓట్లతో గెలిచిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే... అమరావతి నిర్మాణంలో, ప్రతి అడుగుకి కోర్ట్ ల ద్వారా అడ్డం పడే ఈయన, సదావర్తి భూముల వేలం గురించి హంగామా చేసిన విషయం తెలిసిందే. హై కోర్ట్ ఆదేశం ప్రకారం కక్క లేక మింగ లేక, 22 కోట్లకు, మరో 5 కోట్లు ఇచ్చి, ఆ భూములు ఆళ్ళనే తీసుకోమన్న విషయం తెలిసిందే...

అయితే, అనుకున్నది ఒక్కటీ.. అయినది ఒక్కటీ.. అన్న చందాన, ఆళ్ళ ఆ డబ్బులు కట్టారు... అయితే ఈ కేసు తాజాగా సుప్రీం కోర్ట్ కు వచ్చింది... సంజీవ రెడ్డి అనే ఆటను, భూముల వేలం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషన్ వేశారు...

ఈ భూముల వేలం ప్రక్రియను మళ్ళీ, ఈ నల 14 న కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది... అంతే కాదు, ఈ భూములు విషయంలో హడావిడి చేసిన ఆళ్ళకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది సుప్రీం... వేలంలో పాల్గొనాల్సిందేనని ప్రతివాది పిటిషనర్ ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కోర్టు ఆదేశించింది. ఒక వేళ వేలంలో పాల్గొనకపోతే ఇప్పటికే కట్టిన రూ. 10 కోట్లు జప్తు చేస్తామని సుప్రీం హెచ్చరించింది. వేలంలో పాల్గొని హైకోర్టు కంటే తక్కువ ధర కోడ్ చేస్తే రూ.15కోట్లు జప్తు చేస్తామని హెచ్చరించింది.... దీంతో ఆళ్ళ నోట్లో పచ్చి వెల్లక్కాయ పదినట్లు అయ్యింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read