మీ దాక వస్తే కాని నొప్పి తెలియలేదా ? మీ రాజకీయం కోసం, సినిమా పరిశ్రమ మొత్తం ఏకం కావాలా ? సినీ ఇండస్ట్రీ పై ఇన్ని రోజులుగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో, అవేమీ పట్టించుకోని మీరు, మీ మీదకు వస్తే మాత్రం, వచ్చి హడావిడి చేస్తారా ? అదీ రాజకీయంగా వాడుకుంటారా ? ఇది ప్రతి ఒక్క సామాన్యుడు అభిప్రాయం... కాని, ఇదే అభిప్రాయం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కూడా వినిపిస్తున్నారు... పవన్ బ్యాచ్ చేస్తున్న హడావిడి పై మండిపడుతున్నారు... టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులలో ఒకడిగా ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురులో కీలక వ్యక్తిగా పేరు గాంచిన అల్లు అరవింద్ మాటలకు ఎదురు ఉండదు అనే అభిప్రాయానికి చెక్ పడింది. అరవింద్ కు కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో నాగార్జున మేనకోడలు సుప్రియ అరవింద్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసింది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా అతడి తల్లిని టార్గెట్ చేసే విధంగా కొన్ని ప్రముఖ ఛానల్స్ నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నాయి అంటూ దానికి వ్యతిరేకంగా పవన్ తన రాజకీయ కార్యకలాపాలను పక్కకు పెట్టి గత కొద్ది రోజులగా ఆ ఛానల్స్ ను చూడవద్దు అంటూ పవన్ చేస్తున్న హడావిడి తెలిసిందే. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పవన్ కు సపోర్ట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సమావేశంలో సుప్రియ అరవింద్ ల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. అరవింద్ న్యూస్ చానల్స్ ను బ్యాన్ చేద్దాం అని ప్రకటించగా, ఈ సందర్భంలో సుప్రియ అరవింద్ ను ఉద్దేసించి మాట్లాడుతూ కొంతకాలం క్రితం ఒక టివి యాంకర్ ఒక హీరోయిన్ విషయమై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తూ మాట్లాడిందట.
అంతేకాదు అప్పట్లో తాను ఆ కామెంట్స్ ను ఖండించమని కోరుతూ పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు మెసేజ్ లు పెట్టినా స్పందించని సందర్భాలను గుర్తుకు చేసి, అప్పుడు ఆవిషయాలు అన్యాయంగా అనిపించలేదా అంటూ అరవింద్ ను అందరి ఎదురుగా సుప్రియ ప్రశ్నించిందని, ఆ పత్రిక వివరణాత్మకంగా వార్తను వ్రాసింది. దీనితో ఊహించని ఈ పరిణామానికి అరవింద్ షాక్ ఐనట్లు తెలుస్తోంది. ఆ తరువాత అరవింద్ టివి9, ఎబిఎన్ ఛానల్స్ కార్యక్రమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు ఎవరూ వెళ్ళకూడదు అన్న తీర్మానాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఇండస్ట్రీ పెద్దలతో పాటు సుప్రియ కూడ తీవ్రంగా వ్యతిరేకించినట్లు టాక్. మొత్తానికి, తమ రాజకీయ ప్రయోజానాల కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న పవన్, అల్లు బ్యాచ్ కి, సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరూ మద్దతు పలకటం లేదు...