సురేంద్ర బాబు ఐపీఎస్... ఈ పేరు వింటేనే, నేరస్థులు పారి పోతారు. రాజకీయ నాయకులు గడగడలాడతారు. బెజవాడలో రౌడీలు రెచ్చిపోతున్న టైంలో, తాట తీసి, అందరినీ లైన్ లో పెట్టారు. తనమన అనే బేదాలు ఉండవు. అధికార పక్షం అని కూడా చూడరు. కేవలం రూల్స్ తో పని చేస్తూ, నిజాయితీగా నిష్పక్షపాతంగా పని చేసే నైజం ఆయనది. ప్రతి ఒక్క యంగ్ ఐపీఎస్ కి ఆయాన ఆదర్శం. చంద్రబాబు హయంలో డీజీ ర్యాంక్ వచ్చింది. చంద్రబాబు ఆయన్ను ఆర్టీసీ ఎండీగా చేసారు. తరువాత డీజీపీ కూడా చేస్తారనే వార్తలు వచ్చాయి, కాని ఈ లోపే ప్రభుత్వం మారింది. ఆర్టీసి ఎండీగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అలాగే కార్మికులకు, రిటైర్మెంట్‌ రోజే సెటిల్‌మెంట్లు ఇవ్వటం, పే స్కేలు చెయ్యటంతో కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వటంతో కార్మికులకు కూడా దగ్గర అయ్యారు. అలాగే, ఆర్టీసిని అప్పుల నుంచి గట్టెక్కించే సంస్కరణలు కూడా చేసారు.

surendrababu 26092019 2

అయితే రాత్రికి రాత్రి జగన ప్రభుత్వం, సురేంద్ర బాబుని తప్పించటం పై, ఈ రోజు వార్త పత్రికల్లో పలు కధనాలు వచ్చాయి. సురేంద్ర బాబు లాంటి సీనియర్ ఆఫీసర్ ని, డీజీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ని తప్పించి, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవటం పై, అందరూ ఆశ్చర్యపోతున్న వేళ, ఈ కధనాలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న,ఆర్టీసి బస్సుల స్థానంలో, ఎలేక్టిక్ బస్సులు తేవటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బస్సులను కొనకుండా, అద్దెకు తీసుకుంటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి, ఈ నెల 11న టెండర్లు పిలిచారు. అయితే ఈ టెండర్ లో పెద్ద పెద్ద కంపెనీలు అయిన, టాటా, అశోక్‌ లేలాండ్‌, ఐషర్‌ మోటార్స్‌ వంటి సంస్థలు పాల్గొంటాయని అందరూ భావిస్తే, కేవలం గోల్డ్‌స్టోన్‌ అనే సంస్థ మాత్రమే పాల్గుంది. ఈ గోల్డ్‌స్టోన్‌ పై ఇప్పటికే తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది. ఇది మేఘా సంస్థ అని, పోలవరంలో మిగిలింది, ఇక్కడ కవర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే, ఇక్కడ కేవలం గోల్డ్ స్టోన్ మాత్రమే టెండర్ వేసింది.

surendrababu 26092019 3

అయితే ఈ అద్దెను రూ.60కి తగ్గకుండా ఇవ్వాలన్న ప్రతిపాదన, ఈ కంపెనీ ఆర్టీసి ముందు పెట్టింది. అయితే ఇందుకు, ఆర్టీసి ఎండీగా ఉన్న సురేంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. ప్రుస్తుతం ఉన్న అద్దె బస్సులకు కిలోమీటరుకు రూ.38 ఇస్తున్నాం అని, అయినా ఇక్కడ 5 రూపాయల నష్టం వస్తుందని, అలాగే ఎలక్ట్రిక్‌ బస్సుల అద్దె తెలంగాణలో రూ.36తో గోల్డ్‌ స్టోన్‌ సంస్థ ఇప్పటికే దక్కించుకుందని తెలిపారు. మనకు అంతకంటే ఎక్కువకు నేను ఒప్పుకోను, టెండర్ వెయ్యండి, ఎవరు తక్కువకు వస్తే వాళ్ళకు ఇస్తాం అని సురేంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి కీలక చర్చలు ఈ రోజు జరగనుంది. అయితే అనూహ్యంగా, సురేంద్ర బాబు నిన్నే బదిలీ అయిపోయారు. సహజంగా ఇలాంటి పెద్ద డీల్ జరుగుతునప్పుడు, ఆ చీఫ్ నే బదిలీ చెయ్యటం జరగదు. కాని ఇక్కడ పై నుంచి ఒత్తిడులు రావటంతో సురేంద్రబాబుని రాత్రికి రాత్రి బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ విషయమై ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు పెద్దలు మంగళవారం సురేంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయి చర్చించినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. సురేంద్ర బాబు ఉంటే, తాము అనుకున్న రేట్లకు టెండర్ రాదనీ, కొంత మంది ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, సురేంద్రబాబుని బదిలీ చేసారని ఈ రోజు పత్రికల్లో కధనాలు వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read