రాష్ట్రంలో కరోనా వైరస్​తో మరో వ్యక్తి మృతి చెందారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగిందని తెలిపింది. కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు కేసుల సంఖ్య 304కు పెరిగినట్టు హెల్త్ బులెటిన్​లో స్పష్టం చేసింది. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ జిల్లాలో మొత్తం కేసులు సంఖ్య 33కు చేరినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న ఆరుగురుని డిశ్చార్జి చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు 74 నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 42, కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27, ప్రకాశం జిల్లాలో 24 , పశ్చిమ గోదావరి జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బులెటిన్​లో పేర్కొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 3677 నమూనాలు పరీక్ష చేస్తే 3270 కేసులు నెగెటివ్​గా నిర్ధరణ అయ్యాయని.. మరో 104 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. అయితే, రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, అమరావతి నామ స్మరణ చేస్తూ, అమరావతి రైతులకు వ్యక్తిరేకంగా మరో అడుగు ముందుకు వేసింది. నేటి నుంచి రాజధాని గ్రామాల్లో ఆర్​-5 జోన్ పై సీఆర్డీఏ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటానికి ప్రయత్నం చేసారు. ఆర్-5 జోన్‌ పరిధిలోని రైతుల అభ్యంతరాలను తెలుసుకోవతనకి అని, ఉదయం 11 గంటల నుంచి 12 వరకు వీడియో కాన్ఫరెన్స్ చేపట్టలనుకున్నారు. అయితే అధికారుల తీరుపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే అభ్యంతరాలు స్వీకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో R5 జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన సీఆర్డీఏ అధికారులను రైతులు అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజాభిప్రాయం ఎలా చేపడతారని రైతులు ప్రశ్నించారు, లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చెయ్యటంతో, ఏపీ సి ఆర్ డి ఏ అధికారులు వెళ్ళిపోయారు. ఇక మరో పక్క, ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 112వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 3 ముక్కల రాజధాని వద్దంటూ నినాదాలు చేశారు. జగన్ అమరావతి తరలింపుపై పునరాలోచన చేయాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read