ప్రకృతిని ప్రేమించే భారతీయ సంస్కృతికి కొనసాగింపుగా ఏరువాక, జలసిరికి హారతి, వన మహోత్సవంతో పాటు, రాష్ట్రంలో సూర్య ఆరాధన కార్యక్రమం కూడా రాష్ట్రం చేపడుతుంది... మనది సన్ రైజ్ స్టేట్... అందుకే ఇక నుంచి ఆ సూర్యుడిని కూడా మనం ఆరాధించాలి అని ప్రభుత్వం కొత్త కార్యక్రమం తీసుకువస్తుంది... చంద్రబాబు మాట్లాడుతూ... "రేపు రాష్ట్ర వ్యాప్తంగా సూర్య ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం... సూర్యుడు ని ఆదివారం అంటే ఇష్టం అందుకే ఆ రోజు సూర్య ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం... రేపు ఉదయం 7 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం లో సూర్య ఆరాధన కార్యక్రమంలో నేను పాల్గొంటా" అని చంద్రబాబు అన్నారు...
చంద్రబాబు మాట్లాడుతూ "ప్రతి ఒక్కరు రేపు విధి గా సూర్య ఆరాధన కార్యక్రమంలో పాల్గొనాలి... సూర్య ఆరాధన కి సంబంధించిన ప్రత్యేకంగా పాట ను రూపొందించిన ప్రభుత్వం... అన్ని మతాల వారు, కులాల వారు సూర్యుడిని ఆరాధిస్తారు... సమస్త జీవకోటిికి సూర్యుడు చాలా ముఖ్యం... అందుకే ఆంధ్రప్రదేశ్ కి "సన్ రైజ్ స్టేట్" అని పేరు పెట్టుకున్నాం.. ప్రతి రోజు అర్ధగంట సేపు సూర్యడి ని ఆరాదించటం వలన చాలా లాభాలు ఉన్నాయి... సూర్యుడు జస్టీస్ చక్రవర్తి టైపు అందరిని ఒకే న్యాయం... సూర్యాడు శ్రామికుడు నిత్యం పనిచేస్తూనే ఉంటాడు... సూర్యుడు మనకు చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నాడు.. త్వరలో భూమి ఆరాధన కూడా చేపడతాం.. అందరూ భూమిని కూడా ఆరాధించాలి...భూమి కూడా మనకు చాలా ఇస్తుంది.." అని చంద్రబాబు అన్నారు...
సూర్యుడికి 4వందల 60 కోట్ల సంవత్సరాలు వయస్సు ఉంటుందన్నారు. సూర్యుని వల్ల పవర్ రేటు తగ్గుతుందని, కాలుష్యం ఉండదని, మనిషి ఎక్కువకాలం బతుకుతాడని తెలిపారు. డి విటమిన్ వస్తుందన్నారు. కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించి ఆక్సిజన్ ను పెంచాలన్నారు. తల్లిని గౌరవిచండం మన సంప్రాదాయం అన్నారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని పేర్కొన్నారు. రియాల్టిటికి ఉపయోగం పడుతుందన్నారు.... ప్రకృతిని ప్రేమించే భారతీయ సంస్కృతికి కొనసాగింపుగా ఏరువాక, జలసిరికి హారతి, వన మహోత్సవం, సూర్య ఆరాధన వంటి కార్యక్రమాలు చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం... ఇంతకన్నా భారతీయత ఉన్న ముఖ్య మంత్రిని చూపగలరా...