అమరావతి రైతులకు పోలీసులు బేడీలు వేసిన సంఘటన రాష్ట్రంలో పెను దుమారం రేగింది. అమరావతి రైతులకు బేడీలు వేయటం పై, గత మూడు రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఆ ఆందోళనలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, నిర్బంధాలతో, ఈ రోజు మొత్తం సాగింది. అయితే ఈ సంఘటనలో, ఈ రోజు సాయంతం కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం, వస్తున్న విమర్శలకు తలొగ్గి, అమరావతి రైతులకు బేడీలు వేసిన ఆరుగురు ఎస్కార్ట్ సిబ్బందిపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అమరావతి రైతులు ఇచ్చిన జైలు భరో కార్యక్రమం ముగియగానే, ఈ ఆరుగురు పోలీసులు పై సస్పెన్షన్ ఎత్తేసారు పోలీసులు. రైతులకు బేడీలు వేసిన, ఆరుగురు సిబ్బంది పై సస్పెన్షన్ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఘటన తాము కావాలని చేయలేదని, వారికి బేడీలు వేసే సమయంలో, వారు రైతులు అని తమకు తెలియదని, తమ పై సస్పెన్షన్ ఎత్తేయాలని, ఉన్నతాధికారులకు మోర పెట్టుకోవటంతో, వారి పై సస్పెన్షన్ ఎత్తేసారు. అయితే వీరి పై సస్పెన్షన్ ఎత్తి వేసినా, ఈ ఘటన పై శాఖాపరమైన విచారణ, కొనసాగుతూనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఆదేశాలు ఇచ్చిన వారి పై చర్యలు తీసుకోవాలని, డీఎస్పీ పై, డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చిన ఆ నాయకుడు పై చర్యలు తీసుకోవాలి అంటూ, రైతుల నుంచి గత రెండు రోజులుగా డిమాండ్ లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎవరినీ బాధ్యత లేకుండా, కేవలం విచారణ జరుగుతుంది అంటూ, తంతు ముగించారు.
వారం రోజులు క్రితం, అమరావతిలో, మూడు రాజధానులకు మద్దతుగా, ఆటల్లో కొంత మంది జనాలను తోలుకు వస్తు ఉండటం, అలాగే వారికి ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని ట్రైనింగ్ ఇస్తూ ఉండటంతో, అసలు మీరు ఎవరు ఎక్కడ నుంచో వచ్చి, మా ఊరిలో ధర్నాలు చేయటానికి అంటూ, అమరావతి రైతులు, ఈ ఆటో ఆర్టిస్ట్ లని పట్టుకుని నిలదీశారు. అయితే తమను నిలదీశారు అంటూ, కొంత మంది కేసు పెట్టారు. వాళ్ళు పెట్టిన కేసు ఒకటి అయితే, పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇలా ఎందుకు కేసు పెట్టారు అంటూ కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి , తాను కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నాను అని ప్రకటించగా, పోలీసులు మాత్రం వినలేదు. రెండు వైపులా వెళ్లి కోర్టులోనే తేల్చుకోవాలి అంటూ, 11 మందిని అరెస్ట్ చేసారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఈ దేశ చరిత్రలో లేని విధంగా, ఎస్సీల పైనే, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇలాంటి కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసారు. అయితే ముందుగా నరసరావుపేట సబ్ జైలుకు తీసుకుని వెళ్ళగా, అక్కడ నుంచి మళ్ళీ గుంటూరు జైలుకు తీసుకుని వచ్చారు. ఈ తీసుకుని వచ్చే క్రమంలో, రైతులకు బేడీలు వేసి తీసుకుని వచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాక, దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీంతో మొదట ఈ ఘటనకు బాధ్యులని చేస్తూ, కొంత మంది కింద స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయగా, రెండు రోజులుకే వారి పై సస్పెన్షన్ ఎత్తేసారు. మరి ఈ ఘటనకు బాధ్యులు ఎవరో ప్రభుత్వమే చెప్పాలి.