పట్టణాల పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 30 ర్యాంకులు మూటగట్టుకొంది. దేశవ్యాప్తంగా 4,203 పట్టణ స్థానిక సంస్థల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి 425 ర్యాంకులు ప్రకటించగా అందులో 30 రాష్ట్రానికి దక్కాయి. ఇందులో 18 పట్టణప్రాంతాలు క్రితం ఏడాదికంటే మంచి ర్యాంకులు సాధించగా, 12 గత ఏడాది కంటే కిందకి జారాయి. ఆధ్మాత్మిక నగరం తిరుపతి జాతీయస్థాయిలో 8వ ర్యాంకు సాధించి టాప్‌ టెన్‌లో నిలిచింది. విజయవాడ 12, విశాఖపట్నం 23వ ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. హిందూపురం పురపాలక సంస్థ ఏకంగా 114 ర్యాంకులు ఎగబాకి జాతీయస్థాయిలో 108, రాష్ట్రస్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. గుడివాడ మున్సిపాలిటీ రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే.. తాడిపత్రి 91, నెల్లూరు 59, ఆదోని 54, ధర్మవరంలు 50కి పైగా ర్యాంకులపైకి ఎగబాకాయి. బుధవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రాలు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు.

ap 07032019 2

దేశంలోని పట్టణ స్థానిక సంస్థల మధ్య పోటీ పెట్టి స్వచ్ఛతను పెంపొందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016లో తొలిసారిగా స్వచ్ఛ ర్యాంకింగుల పోటీకి శ్రీకారం చుట్టింది. తాజా సర్వేలో 4,237 పట్టణ స్థానిక సంస్థలు పోటీపడ్డాయి. జనవరి 4 నుంచి 31 వరకు అన్ని పట్టణ స్థానిక సంస్థల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సమాచారాన్ని స్వీకరించి సర్వే పూర్తి చేశారు. మొత్తం 64 లక్షల మంది అభిప్రాయాలను విశ్లేషించి ర్యాంకులను ప్రకటించారు. సర్వే నుంచి తప్పుకోవాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ రాష్ట్రం తప్ప దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. జనాభా ప్రాతిపదికన మొత్తం ఆరు కేటగిరీల్లో ర్యాంకులు వెల్లడించారు. అందులో 10 లక్షలు, 3-10 లక్షలు, 1-3 లక్షలు, 50వేలు- లక్ష, 26 వేలు- 50 వేలు, 25 వేలు, అంతకుమించి తక్కువ జనాభా ప్రాంతాలను ఒక్కో విభాగంగా పరిగణించారు.

ap 07032019 3

రాజధాని ప్రాంతం విజయవాడ నగరం 3,882.46 మార్కులతో జాతీయస్థాయిలో 12, రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. పారిశుద్ధ్య నిర్వహణపరంగా 3 స్టార్‌ రేటింగ్‌ దక్కించుకొంది. 2017లో 19, 2018లో 5 ర్యాంకులో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు 12వ ర్యాంకు దక్కించుకొంది. మొత్తం 52,856 మంది ప్రజలు సర్వేలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రత్యక్ష పరిశీలనలో 1,097, ప్రజాభిప్రాయ సేకరణలో 1,067, సేవలు అందించడంలో 968.45, ఓడీఎఫ్‌ సర్టిఫికేషన్‌లో 750 మార్కులు సాధించింది. రాష్ట్రస్థాయి విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో నిలిచాయి. రాష్ట్రాలవారీగా తొలి అయిదు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ నిలువగా, 308.54 వెయిటేజీతో ఏపీ ఆరో స్థానంలో, 242.69 వెయిటేజీతో తెలంగాణ 8వ స్థానం దక్కించుకున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి 8లో నిలిచింది. పారిశుద్ధ్య నిర్వణలో త్రీస్టార్‌ రేటింగ్‌ దక్కించుకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read