ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. చంద్రబాబుకు గ్లోబర్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు దక్కింది. డాక్టర్ స్వామినాథన్ కమిటీ చంద్రబాబును ఎంపిక చేసింది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబుకు అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డును కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్, చంద్రబాబకు అందజేయనున్నారు. వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం అంశాలను కమిటీ పరిశీలించింది. సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్ వంటి అంశాలను కూడా కమిటీ పరిగణలోకి తసుకుంది. అన్ని అంశాల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నట్లు కమిటీ తేల్చింది.
స్వామినాథన్ ఎవరు..? ప్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్‌ను హరితక్రాంతికి మార్గదర్శకుడిగా రైతులు కొలుస్తారు. తమిళనాడుకు చెందిన ఆయన స్వతహాగా జన్యుశాస్త్రవేత్త. 1966లో మెక్సికోకు చెందిన విత్తనాన్ని పంజాబ్‌కు తెచ్చి దేశీయ రకాలుగా మార్చారు. అత్యధికంగా గోధుమ పండే విత్తనాన్ని సృష్టించారు. అప్పటి యూపీఏ సర్కారు రైతుల స్థితిగతు లపై ఆరా తీయటానికి వెళ్లినప్పుడు స్వామినాథన్ గురించి తెలుసుకున్నది. అన్నదాతకు అండగా నిలిచేలా 2004 నవంబర్ 18న స్వామినాథన్ కమిషన్‌ను వేసింది. ఈ కమి షన్ పలు సిఫారసులు చేస్తూ ఐదు రిపోర్టులను కేంద్రానికి సమర్పించింది.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా, స్వామినాథన్ సిఫార్సులు అమలు చెయ్యాలని గట్టిగా కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత, రైతులకి రుణ మాఫీ దగ్గర నుంచి, నీటిని సమర్ధవంతంగా వినియోగించి పంటలు కాపాడే దాకా అనేక కార్యక్రమాలు చేసారు. రైతుల కోసం ఎన్నో పధకాలు ప్రవేశ పెట్టారు. యాంత్రీకరణ, టెక్నాలజీ ఉపయోగించేలా రైతులని ప్రోత్సహిస్తున్నారు. 52 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తి చెస్ లక్ష్యంతో పనులు మొదలు పెట్టి, ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసారు. మరో పక్క పోలవరం నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు. నీరు-చెట్టు,. నీరు-ప్రగతి, పంట సంజీవిని (వ్యవసాయ చెరువులు), పంట రక్ష (రెయిన్ గన్స్),. ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం క్రింద బోరు బావులు వంటి కార్యక్రమాల ద్వారా సుస్థిర. భూగర్భ, ఉపరితల నీటి నిర్వహణ కోసం పనిచేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కాబట్టే, సాక్షాత్తు, స్వామినాథన్ కమిటీనే చంద్రబాబు కృషి గుర్తించింది. ఇక ఏడవటానికి జీవీఎల్, జగన్, పవన్ రెడీ అవ్వండి.. ఆయన చేసే మంచి పనులకు దిష్టి తగలకుండా ఉంటుంది.