ఈ ఫోటో చూసి బెజవాడ కృష్ణా నడి ఒడ్డో... లేక రాజమండ్రి గోదావరి ఒడ్డో అనుకునేరు... అది నెల్లూరులోని స్వర్ణాల చెరువు... ఇది వరకు ఒక తీరూ దారీ లేని ఈ చెరువు గట్టు, ఇప్పుడు నెల్లూరు వాసులకి సేద తీరటానికి ఒక మంచి ప్రదేశం... కాలక్షేపానికి సినిమా థియేటర్లు మాత్రమే ఉన్న నెల్లూరులో, ప్రత్యామ్నాయంగా కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం పూట ఆహ్లాదంగా గడపటానికి స్వర్ణాల చెరువు ఒక మంచి ప్లేస్...
అక్టోబర్ ఒకటి నుంచి ఐదవ తేది వరకు, రొట్టెల పండుగ కూడా జరగనుండటంతో ఇప్పుడు స్వర్ణాల చెరువు మరింత కళకళ లాడుతుంది... ఘాట్లను శుభ్రం చేశారు. మొక్కలను నాటి.. మిరిమిట్లు కొలిపే లైట్లను అమర్చారు... రోజువారీ పనుల్లో సతమతం అవుతున్న నగరజీవికి ఇక్కడ కాసేపు సేద తీరితే ఒకింత వూరట లభిస్తుంది. స్వర్ణాల చెరువు మరింతగా అభివృద్ధి చెయ్యటానికి, ప్రభుత్వం ప్రణాలికలు రచిస్తుంది.
రొట్టెల పండుగ సందర్భంగా ఈ ఏడాది 14 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే బారాషాహీద్ దర్గా దగ్గర రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.