విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఐకాన్. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో కాలు మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంటుంటే మనం అనేక సార్లు చూసాం. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఒకరు నా ఆత్మ, ఒకరు నా ప్రాణం అని బహిరంగంగా స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. స్వామి వారికి రూపాయికి ఎకరం స్థలం కూడా ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వటం కోసం, విశాఖ శారదా పీఠం పని చేసిందని, రాబోయే రోజుల్లో కూడా పని చేస్తుందని స్వామి గారు చెప్పుకొచ్చారు. ఒక స్వామీజీ ఇలా రాజకీయాలు చెయ్యటం, అదీ ఇలా బహిరంగంగా చెప్పటం, బహుసా ఇదే ప్రధమం అయ్యి ఉంటుంది. తాజగా స్వామి వారికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కోపం వచ్చింది. చంద్రబాబు పై ఎంక్వైరీ వెయ్యమని, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న జగన్ ను కోరారు. మరి జగన్ చిరకాల కోరిక తీర్చిన స్వామి గారి విజ్ఞప్తిని, జగన్ గారు తీరుస్తారో లేదో చూడాలి. అసలు విషయం ఏంటి అంటే, స్వరూపానందేంద్ర సరస్వతి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, తాను రెండు నెలల 20 రోజుల పాటూ చతుర్మాత దీక్షకు వెళుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా, ఉన్నట్టు ఉండి చంద్రబాబు పై విమర్శలు చేసారు. గతంలోని చంద్రబాబు పాలన పై సంచలన వ్యాఖ్యలు చేశారు స్వరూపానంద . చంద్రబాబు నీరుకి అధిక ప్రాధాన్యత ఇస్తూ, నదులకు, చెరువులకు జల హరతి కార్యక్రమం చేసిన విషయం తెలిసిందే. నీటి విలువ తెలియచేస్తూ, ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం నదీ హారతులు పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేసిందని స్వరూపానంద విమర్శించారు. దీని పై విచారణ జరపాలని, జగన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయం పై త్వరలోనే జగన్ మొహన్ రెడ్డిని కలిసి, చంద్రబాబు పై విచారణ చెయ్యమని కోరతానని చెప్పారు. అయితే ఒక స్వామీజీకి ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చెయ్యటం చూస్తున్న ప్రజలు మాత్రం, ముక్కున వేలు వేసుకుంటున్నారు. అన్ని వ్యవస్థల్లో మార్పు వస్తున్నట్టే, ఆధ్యాత్మికంలో మునిగి తేలే స్వమీజీలు కూడా కాలానికి అనుగుణంగా మారతున్నారు ఏమో అని ప్రజల భావన...