ఏ పని చేసవాడు ఆ పని చెయ్యాలి... ఆధ్యాత్మికం ముసుగు వేసుకుని, పొలిటికల్ బ్రోకర్ పనులు చేస్తే, ఈ దేశం ఇలాగే ఏడుస్తుంది. కేసీఆర్, జగన్ లకు ఆస్థాన స్వామి ఒకడు ఉన్నాడు. సరదా పీఠం అని వైజాగ్ లో పెట్టుకుని, కేసీఆర్ ని ఏపి రాజకీయాల్లో తీసుకు రావటం, జగన్ కి సహాయం చెయ్యటంలో, పొలిటికల్ బ్రోకర్ పాత్ర పోషిస్తున్నాడు ఈ స్వామి. ఆయన ఏమి చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని వారికి సహాయం చేసే క్రమంలో, మళ్ళీ తిరుమల పేరుతో రచ్చ లేపే ప్రయత్నం చేసి, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన కేసు పెడతా అనేంతగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. మొన్న బీజేపీ నేతలు తిరుమల పై పెద్ద కుట్ర చేసి, శబరిమల వివాదం లాగా, ఇక్కడ కూడా చేసి, రాష్ట్రంలో అశాంతికి ప్లాన్ చేసారు. అయితే, రాష్ట్రంలో వారి పాచిక పార లేదు. అంతా సద్దుమణిగింది అన్న టైములో , స్వామి మళ్ళీ ఎంటర్ అయ్యారు.

swaroopa 18022019

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో పాలన లోపభూయిష్టంగా మారిందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ధ్వజమెత్తారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందని త్వరలో వాటిని మీడియా ముందు పెడతానన్నారు. తితిదే అధికారులు, ముఖ్యమంత్రిపైన కేసు పెడతానని తెలిపారు. వారిపై కోర్టులో కూడా కేసు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమేనన్నారు. గుంటూరు నగరం గోరంట్లలోని శ్రీపద్మావతి అండాళ్‌ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలీజియన్‌ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం త్వరలో ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని తెలిపారు.

swaroopa 18022019

మీకు రాజకీయాలు ఎందుకండీ? మీది ఆధ్యాత్మిక ఆశ్రమామా లేక రాజకీయ నాయకులకి కాంట్రాక్టు పద్ధతిలో యాగాలు చేసి పెట్టే కాంట్రాక్ట్ సంఘమా? వారికి యాగం చేసి పెడతా... వీళ్ళకి యజ్ఞం చేసి పెడతా అంటూ.....! టీటీడీలో భూములు అన్యాక్రాంతం అన్నారు. ఆధారాలు వుంటే ఇచ్చేయండి పబ్లిక్ కి. లేదంటే మీరే కేసు పెట్టండి. లేదంటే కోర్టులో కేసు వెయ్యండి. అంతే కానీ త్వరలో మీడియాకు ఇస్తాను లాంటి రాజకీయ మాటలు ఎందుకండీ? ఆర్నెల్లు సావాసం చేస్తే వారు - వీరు, అవుతారంట. రాజకీయులతో కలిసి... వారేమి ఆధ్యాత్మికత మీ దగ్గర నేర్చుకున్నారో తెలియదు కానీ, మీరు మాత్రం ఫక్తు రాజకీయులు అయిపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read