వైసీపీ ఊగుతోంది.. అదేంటని అవాక్కయ్యారా? అంటే ఫ్యాన్ ఊగడంకాదని, కార్యకర్తలు, అభ్యర్థులు ఇప్పుడు ఏపీలో ఊగిపోతున్నారు. ఊగిపోవడం అంటే కోపం ఎక్కువై కాదు.. మందు కిక్కు ఎక్కువై.. ఆయనొక పెద్ద పారిశ్రామిక వేత్త, ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన నేత, టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీ నుంచి నరసాపురంలో లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయనే రఘురామ కృష్ణంరాజు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ సమావేశంలో ఆయన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఓ సమావేశంలో ఊగిపోతూ, తడబడుతూ మాట్లాడడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి.

raghu 31032019

ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే ఉన్న రఘురామకృష్ణం రాజు ఆ తర్వాత తిరిగి వైసీపీలో చేరారు. నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కానీ ఓ సమావేశంలో ఆయన ఇలా ఊగిపోతూ కనిపించడం చర్చకు దారి తీసింది. రఘురామ కృష్ణం రాజు మందుపుచ్చుకున్నారని కిక్కు ఎక్కువై అలా ఊగిపోయారనే ప్రచారం ఊపందుకుంది. ఊగుతూ మాట్లాడి, తడబడుతూ మాట్లాడి, జై జగన్ అంటూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యండి అంటూ, తాగుబోతు మాటలు మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలే కాదు, అభ్యర్థులకు కిక్కు ఎక్కువైందంటూ సోషల్ మీడియాతో కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

raghu 31032019

మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌ ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ గత ఎన్నికల్లోవైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే ఈసారి సిట్టింగ్ స్థానాన్ని ఇవ్వని పార్టీ అధిష్ఠానం ఆయనకు గూడూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ప్రచారంలో భాగంగా ఈ నెల 27న ఉదయం 7 గంటల సమయంలో గూడూరు పట్టణం దొమ్మలపాళ్యం వద్ద హల్‌చల్‌ చేశారు. ‘ఒక కోటీ ఇరవై రెండు లక్షలు.. హహ్హహ్హ.. ఒక కోటీ ఇరవై రెండు లక్షలు’ అని రోడ్డు మీద అరుస్తూ దారినపోయేవారు హడలిపోయేలా ప్రవర్తించారు. ఆయన ధాటికి తట్టుకోలేక స్థానికులు.. ‘‘స్వామీ మమ్మల్ని వదలిపెట్టండి’’ అని పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి మధ్య నిషేధం అంటుంటే, ఆయన అభ్యర్ధులు తాగి రోడ్ల పై పడ్డారు... తాగి ఊగుతుంది, కార్యకర్తలు కాదండీ, జగన్ ఎంపీ, ఎమ్మల్యే అభ్యర్ధులు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read