తాడిపత్రిలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదం చల్లారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో ప్రబోదానందస్వామి భక్తులు, పక్క గ్రామాల మధ్య జరిగిన వివాదం, జేసి ఆందోళనతో వాతావరణం హీట్ ఎక్కింది. దీనికి తోడు భక్తుల ముసుగులో ఉన్మాదంగా ప్రవర్తించి, గ్రామస్తులని గాయపరిచి, ఒకరిని చంపటంతో, మరింత టెన్షన్ వాతావరణం పడింది. అయితే చంద్రబాబు కేసు క్లోజ్ గా ఫాలో అవ్వాతం, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ తగిన ఆదేశాలు ఇచ్చారు. చివరకు ఆక్టోపస్ ను కూడా రంగంలోకి దించారు.

jc 17092018

ఈ నేపధ్యంలో ఆశ్రమ నిర్వాహకులతో కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం జరిపిన చర్చలు ఫలించాయి. ఆశ్రమం వదిలి స్వగ్రామాలకు వెళ్లేందుకు భక్తులు అంగీకరించారు. ఆధార్ కార్డులు, స్థానికులుగా ఉన్నవాళ్లను మాత్రమే కుటుంబాలతో సహా అక్కడే స్థిరపడ్డవాళ్లను లోపల ఉండేందుకు అధికారులు అనుమతించారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించేవరకు, అందులో అక్రమంగా ఉంటున్నవాళ్లందరిని వెళ్లగొట్టే వరకు కదలబోనని భీష్మించుకుకూర్చున్న జేసీ దివాకర్ రెడ్డి కూడా శాంతించారు. ఆదివారం సాయంత్రం నుంచి తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించిన జేసీ సోమవారం సాయంత్రం 4-30 గంటలకు తన దీక్షను విరమించారు.

jc 17092018

ప్రభోదానంద ఆశ్రమం దగ్గర ప్రస్తుత పరిస్థితులు, అక్కడినుంచి స్థానికేతనులను బస్సుల్లో పంపించిన వైనాన్ని ఎంపీకి పోలీసు అధికారులు వివరించారు. ఇకపై ఆశ్రమం దగ్గర అరాచకాలపై కన్నెస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో జేసీ తన ఆందోళనను విరమించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆశ్రమంలో ఉన్నవారిని తరలించేందుకు నిన్న రాత్రే పోలీసులు 15 ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. అధికారులతో చర్చలు సఫలం కావడంతో 9 బస్సుల్లో భక్తులను వారివారి ప్రాంతాలకు తరలించారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మాత్రం అనంతపురం బస్టాండ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read