పాదయాత్ర సమయంలో, జగన్ మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ప్రజలు అవన్నీ నమ్మి జగన్ ను గెలిపించారు. అయితే జగన పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన ప్రజలు, రెండు నెలలు కావస్తున్నా, తమ సమస్యల పై కనీసం స్పందించక పోవటంతో, వివిధ వర్గాల ప్రజలు, రాష్ట్ర నలుమూలల నుంచి జగన్ ఇంటికి వచ్చి, ప్రతి రోజు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలోని అనెక్ ప్రాంతాలకు చెందిన అనేక మందిప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జగన్ తాడేపల్లి ఇంటి ముందు పడిగాపులు పడుతున్నారు. తమకు జగన్ అపాయింట్మెంట్ దొరుకుతుందని, అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా కొందరు ఏకంగా వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొంత మందికి మాత్రం, ఎన్ని రోజులు అయినా కనీసం వారి సమస్య తెలుసుకోటానికి ఎవరూ రాకపోవటంతో, ఆందోళన బాట పడుతున్నారు. దీంతో జగన్ ఇంటి దగ్గర ఉన్న తాడేపల్లి భారతమాత జంక్షన్, ధర్నా ప్లేస్ గా మారిపోయింది.
అయితే రోజు రోజుకీ ప్రజలు తమ సమస్యల పై ఆందోళన బాట పట్టి, జగన్ ఇంటి ముందు ధర్నాలు చెయ్యటంతో, ప్రభుత్వం ఈ విషయం పై రియాక్ట్ అయ్యింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు సాకుగా చెప్పి తాడేపల్లిలోని జగన్ నివాసం సహా పరిసర ప్రాంతాల్లో నిరసన, ధర్నాలను నిషేదిస్తున్నాం అని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నిబంధనలను ఎవరినా ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, గుంటూరు అర్బన్, రూరల్, విజయవాడ సిటీ పరిధిలో ఈ నెల 12 నుంచి 30 వరకు పోలీసు యాక్టు అమల్లో ఉంటుందని చెప్పారు. ఎవరైనా నిరసన తెలిపాలి అనుకుంటే, జగన్ ఇంటి వద్ద కాకుండా, విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో నిరనస తెలుపుకోవచ్చని, దానికి కూడా ముందు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. మొత్తానికి అధికారం రాగానే, తన క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఎవరూ నిరసన, ఆందోళన చెయ్యకూడదు అని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.