ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయంతో ప్రజలు రకరకాల షాక్ లు తింటున్నారు. ఇప్పటికే పన్నుల రూపంలో ప్రభుత్వం బాదుతున్న వెరైటీ బాదుడు చూసి, ప్రజలు అవాక్కయ్యారు. పెట్రోల్ రేట్లు, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు, మరుగుదొడ్డి ఉంటూ పన్ను, చెత్త పన్ను అంటూ రకరకాల బాదుడు బాదారు. ఇది ఇలా ఉంచితే, ప్రభుత్వం జారీ చేసిన ఒక ఆర్డినెన్స్ చూసి విజయవాడ ప్రజలు అవాక్కయ్యారు. విజయవాడలో ఆటోనగర్ దాటిన తరువాత తాడిగడప అనే ఊరు అందరికీ తెలిసిందే. తాడిగడప పేరును, ఇప్పుడు ప్రభుత్వం "వైఎస్సార్ తాడిగడప" అంటూ మార్చేసింది. రాత్రికి రాత్రి వచ్చిన ఈ మార్పు చేసి ప్రజలు అవాక్కయ్యారు. అసలు వైఎస్ఆర్ కి తాడిగడపకు సంబంధం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మా ఊరి పేరు తాడిగడగానే ఉంచాలని అంటున్నారు. కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టారంటే అర్ధం ఉంది, అసలు విజయవాడలో ఉన్న తాడిగడపకు వైఎస్ఆర్ పేరు ఏమిటి అంటూ జుట్టు పీక్కుంటున్నారు. రేపటి నుంచి ఇలా ప్రతి ఊరు ముందు వైఎస్ఆర్ అనో, ఇంకో పేరో పెట్టుకుంటూ పొతే, ఎలా అని ? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంటున్నారు. ఇక ఈ విషయం పై తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు.

vij 05012021 1

జగన్ మోహన్ రెడ్డికి మైండ్ లేదని, ఇలాగే బావ పేరు, చెల్లి పేరు, తల్లి పేరు కూడా పెట్టేస్తారా అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక, ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఉంది. మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలుగా ఏపీలోని పలు గ్రామాలు విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన ఏపీ సర్కార్. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి అమరావతి పరిధిలోని గ్రామాలను తీసుకుని వచ్చారు. ఇక మంగళగిరి మున్సిపాలిటీలో 11 గ్రామాల విలీనం చేసారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, బాపట్ల, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, కందుకూరు మున్సిపాలిటీల్లోకి సమీప గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 6 చోట్ల చిన్నస్థాయి పట్టణ ప్రాంతాలు ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసారు. ఇదే క్రమంలో, విజయవాడలోని కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు తదితర ప్రాంతాలను కలుపుతూ "వైఎస్సార్ తాడిగడపగా" పేరు మార్చి పడేసారు. దీని పై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read