పాపం తమ అభిమాన నాయకుడుని కలుసుకోవటానికి 400 కిమీ నడుచుకుంటూ వచ్చి, చివరకు అవకాసం దొరక్క పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భం ఇది. అతని పేరు కిషోర్. తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా నుంచి జగన్ మోహన్ రెడ్డిని కలవటానికి తాడేపల్లి వరకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ నుంచి తాడేపల్లి దాదాపుగా 400 కిమీ. జగన్ ని కలవటానికి వచ్చానని, జగన్ అంటే తనకు అభిమానం అని, కేవలం అభిమానమే అని, తనకు ఇంకా ఏ ఉద్దేశాలు లేవని అతను చెప్పాడు. తనకు ఏ పని చేసి పెట్టాల్సిన అవసరం లేదని, కేవలం అభిమానంతో వచ్చానని అన్నాడు. అయితే తనను జగన్ వద్దకు వెళ్ళనివ్వలేదని, పర్మిషన్ ఉంటేనే పంపిస్తాం అన్నారని, ఒక కామన్ మ్యాన్ కు పర్మిషన్ ఇవ్వరు కదా, ఇప్పుడు నేను అప్పాయింట్మెంట్ ఎక్కడ నుంచి తీసుకుని వస్తాను అని అతను మీడియాతో అన్నాడు. అందుకే నడుచుకుంటూ వచ్చానని, ఇలా అయినా కలవనిస్తారు అనుకుంటే, ఇక్కడ తనను ఆపేసారని, కలవనివ్వటం లేదని మీడియాతో అన్నాడు. కలిసెంత వరకు తాను ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదని అన్నాడు. అయితే పోలీసులు మాత్రం, అదేమీ కుదరదు, పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉండకూడదు అంటూ, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, దారిలో వచ్చే అప్పుడు ఖర్చులకు డబ్బులు అయిపోవటంతో, తన దగ్గర ఉన్న మొబైల్ కూడా అతను అమ్మేశాడని చెప్తున్నారు. ఇంత అభిమానంతో, ఈ యువకుడు, 400 కిమీ నడుచుకుంటూ వచ్చినా, జగన్ మోహన్ రెడ్డి అసలు కలవక పోవటం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, పార్టీ నాయకులను కలవరు అనే పేరు ఉంది.
చివరకు ప్రజలు కూడా అటు వైపు రాకుండా, 144 సెక్షన్ పెట్టారు. ప్రజలు ముఖ్యమంత్రిని కలవటానికి వీలు లేని పరిస్థితితులు ఉన్నాయి. ఎంతో మంది తమ సమస్యలు చెప్పుకోవటానికి ఇక్కడ వరకు వచ్చి, కలిసే అవకాసం లేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ని విమర్శలు వస్తున్నా జగన్ మాత్రం బయటకు రారు. చివరకు ఈ యువకుడు నడుచుకుంటూ వచ్చినా బయటకు రాకపోవటం పై, పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ నడిచి వెళ్ళేది ఏదో కనీసం ఏ తిరుమలో వెళ్ళినా పుణ్యం కలిగేదని పలువురు వాపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే, సోనూసూద్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇలాగే హైదరాబాద్ నుంచి ముంబై వరకు వెళ్లి సోనూసూద్ ని కలిసిన అతనిని దగ్గరకు తీసుకుని, వాటేసుకుని, సెల్ఫీ కూడా దిగి పంపించారని, ఈ వెళ్ళేది ఏదో సోనూసూద్ వరకు వెళ్ళినా, మంచి అయినా జరిగేదని వాపోతున్నారు. ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విమర్శలు నుంచి జగన్ బయట పడతారాని, మారుతారని ఆశిద్దాం.