తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉ-ద్రి-క్త పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ దివాకర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడి మధ్య వా-గ్వా-దం చోటు చేసుకుంది. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో హర్షవర్ధన్ ఉన్నందున తర్వాత పంపిస్తామని పోలీసులు అన్నారు. ఇరువర్గాల మధ్య వా-గ్వా-దం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అందరినీ అక్కడినుంచి పంపించి వేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వెయ్యటానికి జేసీ వర్గం వెళ్తున్న సందర్భంలో, ఉ-ద్రి-క్త-త చోటు చేసుకుంది. ఈ సందర్భంగా, తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం దగ్గర, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య గొ-డ-వ జరిగింది. రెండు వర్గాలు భారీగా అక్కడకు చేరుకోవటంతో, ఏమి జరుగుతుందో అని పోలీసులు కంగారు పడ్డారు. పరిస్థితి చేయి దాటి పోతుంది అని అర్ధమై పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపుచేశారు.
వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్నవారిని అడ్డుకుని బెదిరిస్తున్నారని 36వ వార్డు తెలుగుదేశం అభ్యర్థిని జింక లక్ష్మీదేవి ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి వెళుతుండగా, ఆయన్ను పోలీసులు వెళ్ళనివ్వలేదు. కార్యాలయం లోపల, వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ ఉన్నారని, తర్వాత పంపిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు మాట్లాడుతుండగా వైసీపీ నాయకులు ఒక్కసారిగా దివాకర్‌రెడ్డి వైపు దూసుకుని వచ్చారు. దివాకర్‌రెడ్డి పై దా-డి-కి ప్రయత్నం చేసారు. పోలీసులు అడ్డుకుని జేసీని సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. అయినా కార్యాలయం వెలుపల ఇరువర్గాలు గుమిగూడాయి.
జేసీ కుటుంబానికి పదవులు ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను బరిలో వున్నట్లు తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.గతంలో జేసీ దివాకర్ రెడ్డి మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడం అందరికీ తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొనడంతో మంగళవారం జేసీ పవన్ రెడ్డి, బుధవారం జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీడీపీకి మెజార్టీ స్థానాలు ఇస్తే ప్రజలే తాడిపత్రి చైర్మనను నిర్ణయిస్తారన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తాము పదవులను ఆశించి పోటీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలోనే తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేదని, అలాంటి మున్సిపాలిటీని పందుల స్వైరవిహారంతోను, చెత్తతోనూ నింపేశారన్నారు. .జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకున్న తాడిపత్రి మున్సిపాలిటీలో ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తాడిప త్రి అభివృద్ధి కోసం తాము కొంచెం కఠినంగా ఉండాల్సి వచ్చిందని, ఎవరిపైన ద్వేషం లేదన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి దోహదపడతామన్నారు.