అనంతపురం జిల్లా, తాడిపత్రి వైసీపీలో వర్గ విబేధాలు రచ్చకు ఎక్కాయి. స్థానిక ఎమ్మెల్యే, కారు అద్దాలు ధ్వంసం చేసారు అంటూ, అయూబ్ భాషా అనే వైసీపీ కార్యకర్తను చితకబాదింది, వైసీపీలోని మరో వర్గం. ఆ దాడి దృశ్యాలు, బయటకు వచ్చాయి. అయూబ్ భాషా పై దాడి చేసిన వారిని, టైలర్స్ కాలనీకి చెందిన వైసిపీ నేతలు భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి అనుచరులుగా పోలీసులు గుర్తించారు. దీని పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కారు అద్దాలు పగలుకొట్టారని దాడి చేసారు. ఇక తాడిపత్రి నియోజకోవర్గంలో జరిగిన మరో కార్యక్రమంలో కూడా వైసీపీ నేతలు కొట్టుకున్నారు. చాగల్లు రిజర్వాయర్‍కు స్థానిక ఎమ్మెల్యే జల హారతి ఇచ్చారు. అయితే ఈ జల హారతి కార్యక్రమానికి, మరో వర్గం వైసిపీ నేతలు రావటంతో, రెండు గ్రూపులు మధ్య వాగ్వాదం జరిగింది. రెండు గ్రూపులు ఎమ్మెల్యే ఎదుటే కొట్టుకున్నాయి. దీంతో వైసిపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నలుగురు పై కేసులు నమోదు చేసారు.

అయితే ఈ మొత్తం కార్యక్రమంలో, వైసిపీ నేతలు, కార్యకర్తలు క-రో-నా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు. వందలది మంది వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గున్నారు. మాస్కులు ధరించలేదు. కనీస నియమాలు పాటించలేదు. సామాజిక దూరం కూడా పాటించలేదు. దీంతో, ఆ గ్రమాస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే తరుచూ తాడిపత్రిలో, వైసీపీ రెండు గ్రూపులు మధ్య వర్గ విబేధాలు బయట పడుతున్నాయి. ఒకరి పై ఒకరు పై చేయి సాధించే విధంగా, ప్రతి కార్యక్రమంలో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా, ఎమ్మెల్యే ముందు, ఇరు వర్గాలు బల ప్రదర్శనకు దిగాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకోవటంతో, ప్రస్తుతానికి సమస్య అదుపులోకి వచ్చినా, పరిస్థతి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read