మనషుల అశుద్ధాన్ని నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా తొలగించుటకు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా తాడిపత్రి మున్సిపాలిటీలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా మిషన్ రోబోట్ హోల్‌ను గురువారం కలెక్టర్ వీరపాండ్యన్ ప్రారంభించారు. దాదాపు రూ.22 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మిషన్ రోబోట్ హోల్ పైలెట్ ప్రాజెక్టుతో సీబీ రోడ్‌లోని భూగర్భ మురుగు నీటిపారుదల సంబంధిత వ్యర్థ పదార్థాలను మ్యాన్‌హోల్‌నందు పారిశుద్ధ్య కార్మికులు లేకుండా తొలగించు పనులను మిషన్ రోబోటిక్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ దేశంలో శాస్త్ర సాంకేతిక అన్ని రంగాలలో దూసుకుపోతున్న నేటికాలంలో భూగర్బ మురుగు నీటి వ్యవస్థలో విధులు నిర్వహించడానికి, ఆశుచి కార్యకలాపాలలో పాయిఖానాల పూడిక తీతలోను, మురుగు నీటి గుంతలు , సీవరైజ్ పైపులైన్న పరిశుభ్రతలో మానవ శక్తి వినియోగం నేటికి కొనసాగుతుండటం, దురదృష్టకరమని తెలిపారు.

tadipatri 17082018 2

దేశంలో నేటికి సుమారు 53,236 మంది పారిశుద్ధ్య కార్మికులు మానవ, మల, మూత్రాదులతో ఊడిన మురుగు నీటిపారుదల సంబందిత పనులలో నిమగ్నమై, వాటిని చేతులతో ముట్టుకుంటు దుర్గంధభరిత విషపూరిత వాతావరణములో ప్రాణాలు సైతం ఒడ్డి విధులు నిర్వహిస్తుండటం శోచనీయం అన్నారు. వీటికి చమరగీతం పాడుతూ ట్రైనీ కలెక్టర్ విశ్వనాథన్ కేరళలో రోబోట్ మిషన్ రంధ్రం పనితీరు మంచి ఫలితాలు ఇస్తుందని సమాచరం ఇవ్వడంతో వాటిని అమలుచేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాన్ని తాడిపత్రి పట్టణంలో ప్రయోగాత్మకంగా అములుచేస్తున్నామని తెలిపారు. కేరళ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిభ పాటవాలతో ఆధునిక సాంకేతికతో తయారుచేసిన రోబోట్ మిషన్ రంధ్రమును తాడిపత్రి పట్టణంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టుట శుభపరిణామమని తెలిపారు.

tadipatri 17082018 3

ఈ యంత్రంతో గంటలో పనులు పూర్తిచేయడం జరుగుతుందని, 10 మీటర్ల లోతు వరకు గల వ్యర్థ పదర్థాలను పూర్తిగా తొలగించ గల సామర్ధ్యం ఈ మిషన్‌కు ఉందన్నారు. ఈ ప్రక్రియ రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు ఆదర్శప్రాయం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యంత్రం పనితీరుపై కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. శాసన సభ్యులు జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో దాదాపు 1.20 లక్షల జనాభా ఉందని, 2008లో పట్టణంలో అండర్ డ్రైనేజీ ఏర్పాటుచేశామని, దాదాపు 120 కిలోమీటర్లు విస్తీర్ణంతో 30 వేల మ్యాన్‌హోలతో అండర్ డ్రైనేజీ ఉందన్నారు. మ్యాన్‌హోల్‌లోనున్న విష వాయువులు ఎంత మోతాదులో ఉన్నాయన్నది కంప్యూటర్ స్క్రీన్‌లో తెలుస్తుందని, కార్మికులతో కాకుండ రోబోహోల్‌తో మ్యాన్‌హోల్‌ను శుభ్రపరిచడం శుభపరిణామమన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read