ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని టీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రకటించడం, రాష్ట్రానికి వచ్చిన టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వైసీపీ పెద్దలు ఘనస్వాగతం పలకడం, వంటివి చూసాం. అయితే, ఇక్కడ వీళ్ళు వచ్చి ఇలా వాగుతున్నారు అంటే, దానికి జగన్ మోహన్ రెడ్డే కారణం. జగన్ ఎప్పుడూ ఆంధ్రా పోలీసులు పై, ఆంధ్రా డాక్టర్ల పై, ఆంధ్రా అధికారుల పై నిందలు వేస్తూ, వారిని తిడుతూ ఉంటారు. ఈ అలుసో ఏమో కాని, ఇప్పుడు ఏపీ పోలీసులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌లో యాదవ గర్జన సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీసులు అనవసర నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు.
ఏపీలో ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదన్న సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామన్నారు. మేము ఏపీలో సభ నిర్వహించుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. ఏపీలో మా పార్టీ లేకపోయినా అక్కడ ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించాలని బహిరంగంగానే చెబుతామని వెల్లడించారు. ఎవరికి ఓటేయాలో చెప్పకపోయినా.. ప్రభుత్వాన్ని ఓడించాలని మాత్రం చెబుతామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుని ఓడించటమే మా ధ్యేయం అంటూ, తలాసాని చెప్పుకొచ్చారు. గతంలో కూడా, తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలో తలపెట్టాలనుకున్న ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. ర్యాలీకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో అప్పట్లో అనుమతి నిరాకరించారు.
అయితే ఈ వ్యాఖ్యల పై ఏపి పోలీసులు ఇంకా స్పందించలేదు. ఎక్కడా లేని స్వేఛ్చ, ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుదని, అందుకే ప్రతోడు ఇక్కడ తోక జాడిస్తారని, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, వారు నిబంధనలు ప్రకారమే నడిచుకుని ఉంటారంటూ, తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ కలిసి రాజకీయం చేయబోతున్నాయనీ, ఆంధ్రావాళ్లను పదేపదే దూషించిన కేసీఆర్, కేటీఆర్‌లతో జగన్ ఎలా చేతులు కలుపుతారనీ వారు నిలదీశారు. ఏపీలో కూడా సెంటిమెంట్ ఉందని గుర్తుచేశారు. ఆంధ్రాకు ప్రత్యేకహోదా వద్దన్న నేతలతో జగన్ ఎలా భేటీ అవుతారని కూడా వారు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోనూ ఆంధ్రావాళ్లను టీఆర్ఎస్ నేతలు దూషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.