రాష్ట్రంలో వైసీపీ రోజు రోజుకీ రెచ్చిపోతుంది. మొన్న మాచర్ల సీన్ మర్చిపోక ముందే, ఈ రోజు తంబళ్లపల్లి ముదివేడు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ నుంచి మొదలైన రచ్చ చివరకు మాచర్ల లాగే, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల రాళ్ల దా-డి వరకు వెళ్ళింది. అక్కడితో ఆగకుండా ముదివేడులోని టీడీపీ సానుభూతిపరుల ఇళ్లలోకి వైసీపీ కార్యకర్తలు చొరబడి దా-డి చేసారు. వైసీపీ కార్యకర్తల దా-డిలో పలువురు టిడిపి కార్యకర్తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. దా-డి దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం చేసారు వైసీపీ కార్యకర్తలు. ఏకంగా లైవ్ పెట్టి, తాము ఇలా చేస్తాం, ఎవడైనా మాకు లెక్క లేదు అనే విధంగా, వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇప్పటికే మాచర్ల ఘటన పై టిడిపి పోరాటాలు చేస్తూ ఉండగానే, ఈ రోజు మళ్ళీ తంబళ్లపల్లిలో రెచ్చిపోయింది వైసీపీ. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటంతోనే, ఈ ఇబ్బందులు అని టిడిపి నేతలు వాపోతున్నారు.
తంబళ్లపల్లిలో మాచర్ల సీన్ రిపీట్.. లైవ్ పెట్టి మరీ టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై పడి రెచ్చిపోతున్న వైసీపీ
Advertisements