"అడుత్త ప్రథమర్ చంద్రబాబు నాయుడు?", అంటే "' కాబోయే ప్రధానమంత్రి' చంద్రబాబు"... ఈ మాట అంటున్నది ఆ రెండు పత్రికలు కాదు, ఉగాది పంచాంగం చదివే పంతులు గారు కాదు.. తమిళనాడులో వెలిసిన పోస్టర్లు... వనక్కమ్ ఇండియా అనే పత్రికలో వచ్చిన వార్తా, ఇలా పోస్టర్ లు వేసి, తమిళనాడులో గోడలకి అతికిస్తున్నరు... ఇదేదో ఆశామాషీ విషయం కాదండోయ్... అరవోళ్ళు అంత సామాన్యంగా పక్కన వాళ్ళని పొగడరు... చంద్రబాబు, మన అవకాశాలు తీసుకుపోతున్నాడు అనే కోపం ఉంటుంది... అవన్నీ పక్కనపెట్టి, మన పక్క రాష్ట్రం వారు, మనకు ఇస్తున్న గౌరవం ఇది...
కాని మన సొంత రాష్ట్రంలో ఉన్న పిల్ల కాకులు, ఏమి చేస్తున్నారో చూస్తున్నాంగా... ఢిల్లీతో పోరాడుతుంటే, ఢిల్లీని అనే దమ్ము లేక, చంద్రబాబుని బలహీన పరుస్తున్నారు... ఈ పోస్టర్లు మాత్రమే కాదు, రెండు రోజులు నుంచి చంద్రబాబు ఢిల్లీతో డీ కొడుతున్న విధానం, తమిళనాడులోని పత్రికలు, చానళ్లు పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించాయి. ప్రధాని నరేంద్రమోదీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా ఢీకొట్టారంటూ కొనియాడింది. ఇతర రాష్ట్రాల వ్యవహారాలను ఎప్పుడూ అంతగా పట్టించుకోని తమిళమీడియా.. ‘టీడీపీ ఆగ్రహం’ గురించి మాత్రం పతాకశీర్షికల్లో ప్రచురించడం విశేషం.
తమిళులకు అనేక విధాల అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై .. చంద్రబాబులా తిరగబడటానికి ఇదే తరుణమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. తన రాష్ట్ర హక్కుల కోసం బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన చంద్రబాబును చూసి ఈపీఎస్, ఓపీఎస్‌లు బుద్ధి తెచ్చుకోవాలని డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్ ఘాటుగా హితవు పలికారు. ‘‘కావేరీ విషయంలో తమిళనాడును మోదీ ప్రభుత్వం వంచించింది. ఈ విషయంలో చంద్రబాబులా కేంద్రాన్ని నిలదీసే సత్తా ఈపీఎ్‌స-ఓపీఎ్‌సలకు ఉందా? చంద్రబాబుకున్న రోషంలో కొద్దిపాటి అయినా ఈ ఇద్దరు నేతలకు ఉంటే రాష్ట్ర హక్కుల్ని సాధించుకోవచ్చు’’ ఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్ పేర్కొన్నారు.