ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి మూడు తెలుగు ఛానెల్స్ ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. విజయవాడలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన తమ్మినేని, ఈ విషయం పై స్పందిస్తూ, అసెంబ్లీ నియమావళి, నిబంధనలు విషయంలో ,అసలు రాజీ పడే సమస్యే లేదని చెప్పారు. అసెంబ్లీ నియమాకలకు వ్యతిరేకంగా పని చేసినందుకే ఆ మూడు ఛానెల్స్ పై నిషధం విధించామని చెప్పారు. వారికి నోటీసులు పంపించామని, ఎవరైనా సరే, అసెంబ్లీ ఆవరణలో నిబంధనలు పాటించల్సిందే అని తమ్మినేని అన్నారు. పెద్ద పెద్ద చానల్స్ అయ్యి ఉండి కూడా, అసెంబ్లీ నిబంధనలు అన్నీ తెలుసి కూడా, వారు తెలియనట్టు వ్యవహరిస్తే ఎలా అంటూ స్పీకర్ తమ్మినేని, ఆ మూడు ఛానెల్స్ ని నిలదీశారు.
నిద్రపోయే వారిని లేపచ్చు, కాని నిద్ర నటించే వారిని ఏమి చేయలేం, వారికి తగిన విధంగా సమాధానం చెప్పాల్సిందే అంటూ తమ్మినేని అన్నారు. అయితే, ఈ విషయం పై ఇప్పటికే ఆ ఛానెల్స్, స్పీకర్ కు వివరణ ఇచ్చాయి. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో, అక్కడ ప్రెస్ మీట్ వెయ్యటం తప్పే అని, తప్పు తెలుసుకుని రెండు నిమషాల్లోనే లైవ్ ఆపేసామని, మరొక్కసారి ఇలా జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చాయి. అంతే కాదు వివధ జరనలిస్ట్ సంఘాలు వెళ్లి స్పీకర్ ను కలిసి, బ్యాన్ ఎత్తేయమని కూడా చెప్పాయి. అయితే అప్పటి వరకు ఐ & పీఆర్ నుంచి లైవ్ ఫీడ్ ఇస్తున్న ఒక ఛానెల్ ని, అది కూడా ఇవ్వటానికి వీలు లేదు అంటూ మరిన్ని ఆంక్షలు పెట్టారు. దీంతో ఆ ఛానెల్స్ అవాక్కయ్యాయి. వివరణ ఇచ్చినా స్పీకర్ కనికరించాలేదని వాపోయాయి.
ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెల్స్‌ను అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశం లేకుండా స్పీకెర్ నోటీసులు ఇచ్చారు. 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగినందుకు, ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు. అయితే, వారు సస్పెండ్ అయిన తరువాత, బయటకు వచ్చి ప్రెస్ తో మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడిన దానిని, రెండు నిమషాలు ఈ మూడు ఛానెల్స్ లైవ్ ఇచ్చాయి. అవి నిబంధనలకు వ్యతిరేకం అంటూ, ఆ మూడు ఛానెల్స్ ని బ్యాన్ చేసారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన సందర్భాలు లేవని అంటున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఈ రూల్ పెట్టారని, తరువాత వచ్చిన ప్రభుత్వం, మొన్న చంద్రబాబు ప్రభుత్వం కాని, ఎప్పుడు ఇలా చెయ్యలేదని, అలా అయితే సాక్షి ఛానెల్ కి అసలు అసెంబ్లీ ఎంట్రీ కూడా ఉండేది కాదని గుర్తు చేస్తున్నారు. ఏదైనా స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి, ఆయన మీద గౌరవంతో ఏమి మాట్లాడలేం.