మన దేశంలో ఒక వ్యవస్థని మరో వ్యవస్థ గౌరవించుకోవటమే ఇప్పటి వరకు చూసాం. పలానా వ్యవస్థలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే, మరో వ్యవస్థలోని వ్యక్తులు, వేలు ఎత్తి చూపించటం ఎప్పుడూ లేదు. అలాంటిది ఇప్పుడు ఒక రాష్ట్ర స్పీకర్, దేశ అత్యున్నత సభ అయిన రాజ్యసభ చైర్మెన్ పైనే, వేలు ఎత్తి చూపించారు. నిజానికి వెంకయ్య నాయుడు రూల్స్ పాటించే విషయంలో చాలా ఖటువగా ఉంటారు. సొంత పార్టీ నేతలను, ఏకంగా కేంద్ర మంత్రులనే సభలో హెచ్చరించటం చూస్తూ వచ్చాం. అలాగే పార్టీ ఫిరాయింపులు అసలు ప్రోత్సహించే వారు కాదు. దాని పై గట్టిగా మాట్లాడింది కూడా వెంకయ్యే. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన ఒక ఎంపీ పై అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం కుడా తీసుకున్నారు. అయితే మొన్నీ మధ్య నలుగురు తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరారు.

tammineni 04082019 2

ఆ సమయంలో వారు, ఉన్న ఆరుగురిలో, నలుగురు మెజారిటీ సభ్యులు కాబట్టి, వెంకయ్య అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి, పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అది రూల్ బుక్ లో కరెక్ట్ అయ్యింది. నైతికంగా అది సరైన చర్య కాకపోయినా, బీజేపీతో పాటు, ఆ నలుగురు టిడిపి ఎంపీలు, విలీనం అనే పధ్ధతిలో పార్టీ మారటంతో, వెంకయ్య కూడా ఏమి చెయ్యలేక పోయారు. అయితే, ఇప్పుడు ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, వెంకయ్యను తప్పుబట్టారు. నేను కనుక వెంకయ్య స్థానంలో ఉంటే అలా చెయ్యను అని, వారి పై అనర్హత వేటు వేసే వాడిని అని అన్నారు. నైతిక విలువల లేకుండా, ఫిరాయింపులు నేను ప్రోత్సహించను అంటూ వెంకయ్య నాయుడుని డైరెక్ట్ గా టార్గెట్ చేసారు ఏపి స్పీకర్.

tammineni 04082019 3

అయితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్న పరిస్థితిని మాత్రం, ఆయనకు అనుకూలంగా చెప్పుకున్నారు. సభలో వారిని కంట్రోల్ చెయ్యలేదు కాని, వారిని తన చాంబర్ కు పిలిచి హెచ్చరించాని చెప్పారు. అలాగే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో, 45 ఏళ్ళకే పెన్షన్ ఎప్పుడూ ఇస్తున్నారు అని అడిగినందుకు, తెలుగుదేశం సభ్యులని సస్పెండ్ చెయ్యటం నైతికమా ? అలాగే చంద్రబాబుకి అసలు మైక్ ఇవ్వకుండా, చెయ్యటం నైతికమా ? నీ యమ్మ అన్న మంత్రిని,బులెట్ దిగిందా అన్న మంత్రిని, ఏకంగా బాడీ షేమింగ్ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని, స్పీకర్ ఒక్క మాట కూడా వారించలేదు. ఇది నైతికమా ? వెంకయ్య నాయుడు రూల్స్ ప్రకారం వ్యవహరించక తప్పని పరిస్థితి అది. నిజంగా వెంకయ్య నాయుడు గారు చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే, 13 రోజుల పాటు రెండు పదవుల్లో (ఢిల్లీ ప్రత్యెక ప్రతినిధిగా) ఉన్న విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వెయ్యక పోవటం. ఇప్పుడు ఏపి స్పీకర్ గారు నైతికత గురించి పాఠాలు చెప్పిన తరువాత అయినా, వెంకయ్య గారు విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వేస్తారని కోరుకుందాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read