అమెరికాలో ప్రతి ఏటా జరిగే తానా మాహసభలు, ఈ సార్ కూడా అంగరంగవైభవంగా జరిగాయి. తానా 22వ మహాసభలు, మూడు రోజుల పటు వాషింగ్టన్ డీసీలో జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అక్కడకు వెళ్లారు. ఈ సభలో కొత్త తానా అధ్యక్షుడుని ఎన్నుకున్నారు. మొన్నటి వరకు ఉన్న వేమన సతీష్ స్థానంలో, ఖమ్మంకు చెందిన తాళ్లూరి జయశేఖర్ ను కొత్త తానా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ రాజకీయ నాయకులు పాల్గున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్ కూడా ఈ వేడుకల్లో పాల్గున్నారు. అయితే రాం మాధవ్ కు మాత్రం, ఈ సారి తానా వేడుకులు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆయన తానా సభల్లో తన ప్రసంగం మొదలు పెట్టిన తీరు చూసి అక్కడ ఉన్న తెలుగు వారు అడ్డు పడ్డారు. దేశంలో మోడీ హయాం లో ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్తూ ఉండగా, అక్కడ ప్రవాసాంధ్రులు అడ్డుతగిలారు. ఈలలు, కేకలు వేస్తూ, రాంమాధవ్ ప్రసంగం ఆపేసి, వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు.
నిర్వాహుకులు వచ్చి అలా చెయ్యద్దు అని ఎంత చెప్పినా, తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా ఏపికి చేసిన అన్యాయం చాలక, మళ్ళీ ఇక్కడకు వచ్చి కూడా మోడీ డబ్బా ఎందుకు అంటూ, ఆందోళన కొనసాగించారు. దీంతో ఎంత సేపటికి, ఎవరూ ఆందోళన విరమించకపోవటంతో, రాం మాధవ్ తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్ళిపోయారు. అయితే ఈ పరిణామం పై బీజేపీ ఎదావిధిగా, అక్కడ జరిగింది అంతా, తెలుగుదేశం ప్లాన్ అంటూ, విమర్శలు మొదలు పెట్టింది. కన్నా లక్ష్మీనారయణ మాట్లాడుతూ, అవి తానా మహాసభలు కావని, అవి తెలుగుదేశం మహా సభలు అని, రాం మాధవ్ గారు జాతీయ వాదం గురించి చెప్తుంటే, లోకేష్ గ్యాంగ్ ఆయన్ను అడ్డుకుంది అని చెప్పుకొచ్చారు. అయితే అవి టిడిపి మహా సభలు అయినప్పుడు, అక్కడ ఉన్నది లోకేష్ గ్యాంగ్ అయినప్పుడు, మరి బీజేపీ నేతలు అక్కడకు ఎందుకు వెళ్లినట్టు ? ఈ ప్రశ్నకు మాత్రం, ఎవరూ సమాధానం చెప్పరు. అమెరికాలో ఎదో జరిగితే కూడా, లోకేష్ డబ్బులు ఇచ్చి చేపించాడు అనేంత మేధావులు కన్నా గారు.