నీతీనిజాయితీ, విలువలూ విస్తరాకులూ, దేశభక్తీ జనోద్ధరణా అంటూ కబుర్లు చెప్పే బీజేపీ పార్టీకి అవన్నీ ఉత్తిత్తి కబుర్లు.. తాటాకు దరువులు.. ఆచరణలో దానివి దగుల్బాజీ పనులూ, దరిద్రపుగొట్టు కుయుక్తులూ .. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామిక విలువలన్నిటినీ తుంగలో తొక్కటానికి, అడ్డదిడ్డంగా బరితెగించటానికి 30, 40 ఏళ్ళ కాలం పట్టింది! విలువల వలువలను నట్ట నడివీధిలో నిర్లజ్జగా వదిలిపెట్టటానికి బీజేపీకి మోడీ హయాంలో మూడేళ్లు కూడా పట్టలేదు. అన్ని విలువలకూ పాతరేసి _ అధికార దాహం ఒక్కటే తన పరమాశయమని బీజేపీ పార్టీ రంకెలేస్తున్న నిస్సిగ్గు జాతర రోజూ దేశంలో నడుస్తూనే ఉంది .. కర్ణాటక ఇప్పుడు కాషాయ కంగాళీకి నిలువెత్తు వేదిక.
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 4 టేప్ లు రిలీజ్ చేసింది.. అందులో గాలి జనార్ధన్ రెడ్డి, స్వయంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా కాంగ్రెస్ 5వ టేప్ రిలీజ్ చేసింది... ఇందులో ప్రతి నిమిషం మన ఆంధ్రప్రదేశ్ గురించి కబురులు చెప్పే, బీజేపీ జాతీయ నాయకుడుని అని చెప్పుకునే మురళీధర రావు కూడా ఉన్నాడు.. నువ్వు మా పార్టీలొఇ వచ్చేసేయ్యి.. లకపోతే ప్రోటెం స్పీకర్ చేత, నీకు ఓటు లేకుండా చేస్తాం అంటూ బిసి పాటిల్ అనే కాంగ్రెస్ ఎమ్మల్యేను బెదిరించారు... మొత్తానికి, ఒక్క రాష్ట్రం కోసం, బీజేపీ ఎలా దిగజారిందో దేశ ప్రజలు చూస్తున్నారు...
మోడీ, అమిత్ షా & పరివారం...బలం లేకున్నా అధికారం కోసం నానా గడ్డీ కరుస్తారు .. ప్రలోభాలూ బెదిరింపులూ దేబిరింపులూ .. ఎంతకన్నా దిగజారతారు... తమ నీతిమాలిన వ్యూహాల్లో గవర్నర్లను ఇష్టమొచ్చినట్టు ఉపయోగిస్తారు... అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి ఎక్కువసార్లు గెలిచిన mla ని ప్రోటెం స్పీకరుగా పెట్టటం సాంప్రదాయం... అలా అయితే_ కర్ణాటకలో 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ mla దేశ్ పాండే ని నియమించటం పధ్ధతి... దానిని కాలదన్ని 3 సార్లు గెలిచిన rss వాది బొప్పయ్యను నియమించారు... సిగ్గుమాలిన బీజేపీకి ఇంకా చెప్పటానికి నీతి కబుర్లు ఏమన్నా మిగిలాయా? నాలుగేళ్ల కాలంలో దాని నిజస్వరూపం మొత్తం దేశానికి ప్రదర్శించేసింది !! చాలు చాలు ఇక ... !! చెప్పటానికి నీతులు ఏమీ మిగల్లేదు !! గెలిస్తే గెలవొచ్చు గానీ, గెలిచేంత గొప్పది కాదు బీజేపీ .. ఓడినోడి వైఫల్యాలు గెలిచినోడికి పాఠాలే తప్ప, ప్రశంసలు కావు. దేశం చూస్తోంది .. దేశం మేల్కొంటోంది !!