టాలీవుడ్ యాక్టర్ నందమూరి తారకరత్నకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న తారక్‌కు చెందిన 'ఫ్రెండ్స్ డ్రైవ్ ఇన్' రెస్టారెంట్‌ను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన రెస్టారెంట్ వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ఐతే నిబంధనలను విరుద్ధంగా నడుపుతున్నారని ఫిర్యాదులు రావడం వల్లే కూల్చివేశామని వివరణ ఇచ్చారు. కూల్చివేత సందర్భంగా హోటల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని అనుమతులు తీసుకున్నాకే రెస్టారెంట్ నిర్వహిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అన్నీ కరెక్ట్ గా ఉన్నా కూడా, ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రకటించినా, పట్టించుకోకుండా ముందుకు సాగారు.

taraka 04022019 2

రాత్రివేళ రెస్టారెంట్‌లో సౌండ్ సిస్టమ్‌తో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, తాగుబోతుల ఆగడాలు సైతం పెరిగాయని కాలనీవాసులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు రెస్టారెంట్‌ను కూల్చివేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. గడువులోగా రెస్టారెంట్‌లోని సామగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే తారక రత్న దీని మీద న్యాయ పోరాటం చెయ్యడానికి సిద్ధం అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

taraka 04022019 3

అయితే అధికారులు తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఉన్నట్టు ఉండి ఇలా వచ్చి, కూల్చివేతకు దిగడం దారుణమని అంటున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి అనే సమాచారం ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా, ఎదో యుద్ధానికి వచ్చినట్టు వచ్చారని, ఎందుకు చేస్తున్నారో కూడా కొంత సేపు చెప్పలేదని అంటున్నారు. అయితే దీని వెనుక రాజకీయ కక్ష కూడా ఉంది అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికలలో కూకట్ పల్లిలో నందమూరి సుహాసినికి మద్దతుగా ప్రచారం చేసినందుకు, కేసీఆర్ పై విమర్శలు చేసినందుకు, తమ హీరోను అధికారులు వేధిస్తున్నారని నందమూరి అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే, ముందు చెప్తారని, హెచ్చరిస్తారాని, తరువాత నోటీస్ ఇస్తారని, ఏమి లేకుండా ఇలా చెయ్యటం దారుణమని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read