నిన్న ఉదయం లోకేష్ పాదయాత్రలో పాల్గుని, గుండె నొప్పితో కుప్పకూలిన తారకరత్నని, నిన్నటి నుంచి కుప్పంలో డాక్టర్ లు ట్రీట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పల్స్ లేకుండా హాస్పిటల్ కు వచ్చిన తారకరత్నకు, పల్స్ తెప్పించతంలో కుప్పం డాక్టర్ లు సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి వైద్యులు తారకరత్నకు వైద్యం అందిస్తూ, కాపాడుతూ వచ్చారు. మరింత మెరుగైన చికిత్స అవసరం అని, కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో చంద్రబాబు కర్ణటక ముఖ్యమంత్రితో మాట్లాడారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయాలని కోరారు. నందమూరి కుటుంబ సభులు, తారకరత్న భార్య అందరూ చర్చించి, తారకరత్నను బెంగుళూరు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో, బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి తరలించారు. కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉండగా, కేవలం గంటన్నర సమయంలోనే చేరుకున్నారు. అంబులెన్స్ లోని, ఐసీయూలో కూడా వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. బెంగుళూరుకు చేరుకున్న వెంటనే, తారకరత్నకు డాక్టర్ ఉదయ్ అండ్ టీం చికిత్స మొదలు పెట్టారు. మరి కాసేపట్లో హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని తెలిసింది.
తారకరత్న విషయంలో కీలకమైన అప్డేట్.. అర్ధరాత్రి బెంగుళూరు తరలింపు...
Advertisements