గత ఎనిమిది నెలల నుంచి, ఢిల్లీ స్థాయిలో, చంద్రబాబు పై బీజేపీ పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. దీనికి ఆపరేషన్ గరుడ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఏపికి రావలసిన విభజన హామీల పై, గట్టిగా పోరాడుతున్నందుకు, చంద్రబాబు పై బీజేపీ నేతలు కక్ష కట్టారు. ఇక్కడ జగన్, పవన్ తో గేమ్ ఆడిస్తూ, కులాల కుంపట్లు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క, సిబిఐ, ఈడీ, ఐటి దాడులతో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇవన్నీ రూల్స్ ప్రకారం చేస్తే పరవాలేదు కాని, కుట్రతో చేస్తున్నారు. ఏ ఆధారం దొరక్కపోవటంతో, దొంగ వాంగ్మూలం సృష్టించి, తెలుగుదేశం పార్టీని ఇరికించే, అతి భారీ కుట్ర బయట పడింది. మోడీ-షా, వ్యవస్తలని ఎలా నాశనం చేసారో చెప్పే సంఘటన ఇది. వీళ్ళ పాచిక పారి ఉంటే, ఈ పాటికి తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు, దేశ ప్రజల ముందు దోషిగా నిలబడేవారు.

target cm 23102018 2

అదృష్టవసాత్టు, వాళ్ళలో వాళ్ళో కొట్టుకుని, సిబిఐ వాళ్ళే, ఈ కుట్ర బయట పెట్టారు. ఒకవేళ ఈ కుట్ర బయటకు రాకుండా ఉన్నట్టు అయితే, బీజేపీ ఆపరేషన్ గరుడ సూపర్ హిట్ అయ్యేది. చంద్రబాబుని, జగన్ ని ఒకే గాటిన కట్టాలి అనే వారి ప్లాన్ సక్సెస్ అయ్యేది. పవన్ కళ్యాణ్ రెచ్చిపోయే వాడు. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయేది. తమిళనాడు లాగా, మన రాష్ట్రాన్ని నాశనం చేసే వారు. ఇంత కుట్ర పన్నిన బీజేపీ నాయకుల గుట్టు, సిబిఐ గొడవల ద్వారా బయట పడింది. అసలు జరిగిన విషయం ఇది... కేంద్రంపై యుద్ధానికి దిగిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను ఇరికించేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య మొదలైన కుమ్ములాటల్లో ఈ సంగతి బయటపడింది. అలోక్‌ వర్మకు ‘ముడుపుల మకిలి’ పట్టించి... సీఎం రమేశ్‌ ద్వారానే ఈ లావాదేవీలు జరిగాయనేందుకు తగిన ‘ఆధారాలు’ సృష్టించినట్లు వెల్లడైంది. ఇప్పుడు ఈ కేసులో సీబీఐ తన సొంత డీఎస్పీని అరెస్టు చేయడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

target cm 23102018 3

వేల కోట్లను మనీలాండరింగ్‌ చేసే మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ కేసు నుంచి బయట పడేందుకు ఏపీకి చెందిన సానా సతీశ్‌ బాబు ఏకంగా సీబీఐ డైరెక్టర్‌కే ముడుపులు చెల్లించారన్నట్లుగా రాకేశ్‌ అస్థానా బృందం ఆధారాలు సృష్టించింది. ‘‘నా కేసు గురించి ఈ ఏడాది జూన్‌లో నా పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో చర్చించాను. దీనిపై సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడతానని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ సీఎం రమేశ్‌ను కలిసినప్పుడు... సీబీఐ డైరెక్టర్‌ను స్వయంగా కలిశానని చెప్పారు. ఇక సీబీఐ నన్ను పిలవబోదని కూడా తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే జూన్‌ నుంచి ఇప్పటిదాకా నాకు సీబీఐ నుంచి సమన్లు రాలేదు. దీంతో నాపై కేసు క్లోజ్‌ అయినట్లుగా భావించాను’’ అని సానా సతీశ్‌ గతనెల 26న వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలిపింది. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీనిని ‘అస్త్రం’గా వాడుకుని... అటు సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను, ఇటు సీఎం రమేశ్‌ను అడ్డంగా ఇరికించడమే అస్థానా బృందం అసలు ఉద్దేశం కావొచ్చు! ఈ విషయంలో తన పేరును లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో అలోక్‌ వర్మ అప్రమత్తమై రంగంలోకి దిగారు. వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్న గతనెల 26న సానా సతీశ్‌బాబు ఢిల్లీలోనే లేరని నిర్ధారించారు. ఆయన సంతకాన్ని డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ స్వయంగా ఫోర్జరీ చేసినట్లు తేలింది. అస్థానా ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఇక... అసలు సానా సతీశ్‌ను ఇప్పటిదాకా కలవనే లేదని సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ స్థాయిలో ఏపీపై కుట్రలకు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని అర్థమవుతోంది. మన అదృష్టం బాగుండి, ఇది బయట పడింది కాని, లేకపోతే జరిగే పరిణామాలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read