టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు కానున్నది. ఇప్పటికే ముంబాయి కేంద్రంగా విజయవంతంగా నడుస్తున్న టాటా కేన్సర్ ఆసుపత్రి, విస్తరణలో భాగంగా దేశంలోని మరో అయిదు రాష్ట్రాలలో కేన్సర్ ఆసుపత్రులను ప్రారంభించాలని టాటా యాజమాన్యం నిర్ణయించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రధానమైన నగరాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. రోగుల సంఖ్య విపరీతం కావడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు టాటా యాజమాన్యం కోట్ల ఖర్చుతో ఆసుపత్రులను నిర్మించేందుకుముందుకు రావడం జరిగింది.

tata 26102017 2

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి లేదా విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఆసుపత్రిని నిర్మించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం స్థలం కేటాయించే అవకాశాలున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంగా టాటా ట్రస్ట్ స్థలానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకునే అవకాశాలున్నాయి. టాటా ట్రస్టుకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

tata 26102017 3

రాష్ట్రం విడిపోయిన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన కేన్సర్ ఆసుపత్రి కూడా లేదు. దీంతో టాటా ట్రస్ట్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ తో పాటు రాజస్థాన్,అసోం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా భారీ వ్యయంతో టాటా కేన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. కొత్త సంవత్సరం ఆరంభంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్నకేన్సర్ ఆసుపత్రి ప్రాజెక్టు కోసం ఆసక్తితో ఎదురుచూస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read